Others

కాలజ్ఞాన కర్త...సమాజ సంస్కర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది శంకరుల వలె దేశాటన ద్వారా సంపాదిత జ్ఞానాన్ని ప్రజల వద్దకు చేర్చడం లక్ష్యంగా ఎంచుకుని, సఫలీకృతులై, ప్రజల హృదయాలలో చిరస్థానం సంపాదించుకున్నారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. వైదిక మతావలంబులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించి, సమాజ సంస్కర్తయైనారాయన. జ్ఞాన సముపార్జన చేసి, ప్రపంచంలో ఏ వింత జరిగినా, అది బ్రహ్మం గారు తమ కాల జ్ఞానాధారంతో ఇది వరకే నాడే చెప్పారు అంటూ ప్రజల నోళ్ళలో నానే కాలజ్ఞానియైనారు.
1608-1693 మధ్యకాలంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన హేతువాదిగా, పరమ యోగిగా సాక్షాత్ దైవ స్వరూపులుగా ప్రత్యేకత సంతరించుకున్నారాయన. బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించి చెప్పిన చాలావిషయాలు నిజం అవుతుండడం వల్ల ఆయన బోధనలకు విశ్వసనీయత కలుగుతున్నది. విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీలో జన్మించి, కర్నాటక రాష్ట్రంలో స్కందగిరి పర్వత సానువులలో స్థితమైన పాపాగ్ని మఠాధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబల వద్ద పెరిగి, కడప జిల్లాలోని కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా రూపుదిదప్దుకున్న స్థలంలో సజావ సమాధి నిష్ఠను పొందారు. అతి పిన్నవయసులో కాళికాంబపై సప్తశతి రచించి ఆశ్చర్య పరిచిన వీరంభోట్లయ్యగా పిలువబడిన బ్రహ్మంగారు, వీరభోజ్యుల మరణంతో దేశాటనకై వెళుతూ, శోకతప్త హృదయురాలైన తల్లికి ప్రప్రథమంగా జ్ఞాన బోధ చేస్తూ, సృష్టి క్రమాన్ని వివరించారు.
స్ర్తి, పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్ర శోణితంతో స్ర్తి గర్భధారణ గావించాక, క్రమానుగత మాసవారీ శిశువు ఎదుగుదల, ప్రాణం పోసుకునే విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించి, ఆగామి, ప్రారబ్ద, సంచిత కర్మ సిద్ధాంతం గురించి వివరించి, ఆమెలోని మాయను తొలగించి, లోక కళ్యాణ కారకుడై వెళ్ళారు. శరీరం పాంచ భౌతికమని, ఆకాశం అగ్ని గాలి నీరు భూమి అయిదు పదార్థాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను ముక్కు చెవి నాలుక చర్మము పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరుచుకుని, జ్ఞాన సముపార్జన జరుగుందని, తద్వారా ‘నేను’ అనే అహం జనియిస్తుందని, ‘ఆత్మ’ సాక్షిగా మాత్రమే ఉంటుందని, ‘బుద్ధి’ జీవుడిని నడిపిస్తుందని, బుద్ధిని ‘కర్మ’ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యం కాదని, కనుక పరబ్రహ్మను ధ్యానిస్తే ‘మోక్ష ప్రాప్తి’ కలుగగలదని బోధించారు. దూదేకుల కులానికి చెందిన సైదులును శిష్యునిగా చేసుకుని, ఉన్నత బోధనలు గావించి, సిద్ధి పొందిన జ్ఞాన సంపన్నుని చేసి సిద్దయ్యగా నామకరణం చేశారు.
శివకోటయ్య కూతురును వివాహమాడి కొంతకాలం సాంసారిక జీవితం గడుపుతూనే తత్వబోధలు చేశారు. బనగానపల్లె నవాబుచే సత్కారం భూదానం పొందారు. కందిమల్లయ పాలెంలో వసించి, ప్రజలకుజ్ఞాన బోధ గావించారు. హైదరాబాద్ నవాబుకు జ్ఞాన బోధ చేశారు. దైవాంశసంభూతులుగా మహిమలెన్నో ప్రదర్శించి, అశేష శిష్యులను కలిగి, చివరకు సిద్దయ్యకు కమండలం, దండం, పాదుకలు, ముద్రిక ఇచ్చి సమాధిలోప్రవేశించారు. తత్వబోధ చేసి ఆగామి కాలజ్ఞాన కర్తగా పేరెన్నికగన్నారు బ్రహ్మంగారు.

- ఎస్. రామకిష్టయ్య