Others

వివేకవీచిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్నాళ్ళుగా
పుస్తకాలు మాత్రమే చదువుతూ
లోకాన్ని అధ్యయనం
చెయ్యడం మానుకున్నాను
పురాణాలు వింటూవింటూ
కదులుతున్న కాలాన్ని విస్మరించాను

కావ్యపాత్రలకు పట్టం కడుతూ
కళ్లెదుటి మనుష్యుల్ని మర్చిపొయ్యాను
ఉత్ప్రేక్షలకు నగిషీలు చెక్కుతూ
స్వభావోక్తిని పక్కనబెట్టాను
ఏళ్ళు పైబడ్డట్టు
కాళ్ళే చెప్తున్నాయ
జీవనయాత్రలోని దూరాన్ని
కిలోమీటర్లతో కొలుస్తున్నాను

ఇప్పటికి గదా
కళ్ళు తెరుచుకున్నాయ
పక్కవాడి హృదయంలోకి
దారివెయ్యటం నేర్చుకుంటున్నాను

- డా. ఎన్.గోపి