వినమరుగైన

శివశివ అనరాదె మనసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. స్వామి! భక్తవరులను నీవరసి మురిసి
రెప్ప చందానఁ గావుదవెప్పటికిని
నీటి బొట్టుతో నిను ఁబిల్వ నిలతువయ్య
పాహిమాం పరమేశ్వరా!పార్వతీశ!

భావం: పార్వతీ పతీ! నీ భక్తులను నీవుకంటికిరెప్పలా కాపాడుకుంటావు. నీటిబొట్టితో నిన్ను పిలిస్తే చాలు మాముందు సాక్షాత్కరిస్తావు

తే.గీ. ఎన్నిజన్మాల పుణ్యమో ఈశ్వరా! మ
హదవకాశంబు లభియించె హర హరా! శ
తకమునల్లితి నీ కృపాధార ఁ దడిసి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఎనె్నన్ని జన్మాల పుణ్యఫలమో గాని నీ దయామృత ధారలలో తడిసి నీపై శతకమునల్లే మహదవకాశం లభించింది.

తే.గీ. అణువణువునందు హారతులందుకొనుచు
దీనజన హృదయాలలో ఁ దిరిగితీవు
శక్తిమంతులఁ జేతువో శంకరయ్య
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: పాహిమాం ఈశ్వరా! అణువణువునుండి హారతులందుకుంటూ దీనజన హృదయాలలో తిరుగుతుంటావు. అందర్నీ శక్తిమంతులను చేస్తుంటావు కదయ్యా.

తే.గీ వెండికొండపై వెలుగొందు వేల్పు వీవు
వేల్పులకు వేల్పు నిలవేల్పు వే గ్రహింప
అహరహంబులు జపియింతు నాత్మలోన
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: పార్వతీ పతీ! వెండికొండపై వెలుగొందే నీవు దేవ దేవుడవు. మా ఇలవేల్పువు కూడా. అనునిత్యం ఆత్మలో నీనామజపం చేస్తుంటాను..

తే.గీ. శివ శివా! యంచు నీటిని ఁ జిలుకరింప
జేరవచ్చెదవో ఈశ! సిరుల నిడెద
వెంత దయగలవాడవో పిలువకున్న
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: పార్వతీ పతీ! శివశివా అంటూ నీటిని చిలుకరిస్తే చాలు చేర వచ్చి సంపదలనిచ్చే దయామయుడవయ్యా నీవు.

తే.గీ. ముజ్జగంబులనేలెడి మోక్షదాయి
గరళ కంఠేశ! సంకట హర!హరుండ!
సుస్థిరంబు నిడవె త్రిశూల ధారి!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ త్రిశూలధారీ! శంకరా! గరళకంఠా! సంకటహరా ముక్తిప్రదాత! సుస్థిరత్వాన్ని ప్రసాదించవయ్యా!

తే.గీ. శివశివా! యని స్నానంబుఁ జేసినంత
ఫాలనేత్రుని కభిషేక ఫలము గల్గు
కానిచో శవస్నానంబు కంటిరేని
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: శంకరా! శివశివా! అంటూ స్నానం చేస్తే దానివల్ల నిన్నభిషేకించిన ఫలితం కల్గుతుంది. అలా చేయని పక్షంలో అది శవస్నానమే అవుతుంది ప్రభూ!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం