Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే!... ఏంచేయాలి?... ఎలా చేయాలి?... వాళ్ళకి, ఆ యజ్ఞంచేసే దశరథునికి, జనకునికి తాను సంతానాన్ని ప్రసాదిస్తే?... లేక తానూ తన వారే వారికి సంతానంగా మారితే?... వారిమధ్య భూమీద మనుష్యులుగా అవతరిస్తే?... ఎలా ఉంటుంది?... ‘‘్ధర్మోరక్షతి రక్షితః’’కదా?... దివ్యంగా ఉందీ యోచన!...
అలా అనుకుని, ఇలా చూశాడో లేదో, గాలీ, వెలుతురూ, భూమీ... ఆకాశం, సముద్రం... ఒక్క మాటలో పంచభూతాలన్నీ తన పంచన చేరాయి! తనని చుట్టుముట్టాయి... తనకు ప్రదక్షిణలు గావిస్తున్నాయి తననొక గణనాథుని గావిస్తూ!... ఎంత విచిత్రం?
‘‘ఏం చేయమంటారు?... ఎలా సహకరించమంటారు మమ్మల్ని?...’’ అంటూ గొంతెత్తి అరుస్తున్నాయ్! నినదిస్తున్నాయ్!
ఏమిటిది?... ఎలా తెలిసింది వీటికి?... ఇది తన సంకల్పం... మాత్రమే కాదా?... ఒక విశ్వ సంకల్పమా?... మహాసంకల్పమా?... తానా మహాసంకల్పంలో ఒక తరంగం మాత్రమేనా?... ఒక బుద్బుద ప్రాయమేనా?...
ఆశ్చర్యపోయాడు! ఆతని కళ్ళు చెమర్చాయి! ఆ సాగర కెరటాల మధ్య ఆలోచన కుదరడం లేదు. అసలు తానే ఒక మహార్ణవమేమో!... సాగర గంభీరంగా సాగింది ఆతని ఆలోచన!...
‘‘మమ్మల్ని సహకరించమంటారా?...’’ అంటూ!
ఒక్క క్షణం యోచించాడు. ఆలోచనా మహాసాగరంలో మునిగి తేలాడు.
‘‘అవును నేను భూమీద మానవునిగా జన్మిస్తాను. మీరంతా నా పరివారంగా జన్మించండి! మనమంతా దుష్టశిక్షణకై, శిష్ట రక్షణకై అవతరిద్దాం!’’అంటూ ఆనతిచ్చాడు. అభయహస్తం పట్టాడు.
అవి శిరస్సు వంచి అభినందనం చేశాయి. తమ అంగీకారాన్ని ప్రకటించాయి.
ఆయన చిరునవ్వుల్ని చిందించాడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087