Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్థాన గాయనీ గాయకులు మేల్కొల్పులు పాడుతున్నారు శ్రవణప్రేయంగా! దిగివచ్చిన దేవతల్లా పక్షులు! వాటి కిలకిలా రావాలు ఆశీస్సుల్లా ఉన్నాయి! ఎంతటి శుభోదయం! ఎంతటి మంగళదాయకం!
మహారాజు కుడిభుజం, కుడి కన్ను అదిరాయి శుభాన్ని సూచిస్తూ!...
మంచం దిగుతూనే, ఇటు భూమాతకు నమస్కరిస్తూ, అటు తన కులదైవం సూర్యభగవానునికి అంజలి ఘటించాడు. తన మనోవాంఛని నెరవేర్చమంటూ!...
కాలకృత్యాల్ని తీర్చుకున్నాడో లేదో తన కులగురువు వశిష్ఠ మహర్షికి కబురంపాడు. ఆయన క్షణాల్లో రెక్కలుకట్టుకు వాలాడక్కడ!
తన మనసులోని బాధనంతా నివేదించుకున్నాడు.
‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమన్నది ఏదీ లేదు ప్రభూ!... మీ దృఢ సంకల్పమే మీకు దారిచూపుతుంది! మానవ సంకల్పమే మాధవ సంకల్పం!... మహాసంకల్పం!... శుభమస్తు!... సత్సంతాన ప్రాప్తిరస్తు!...’’ అంటూ అభయముద్ర పట్టాడాతడు.
‘‘ఎలా?... ఈ వయస్సులో నాకు సంతానమా?... ఎలా సాధ్యం మహర్షీ...’’ చేతులు జోడించాడు మహారాజు.
‘‘పుత్రకామేష్టి యజ్ఞం చేయండి. మీ సంకల్పం నెరవేరుతుంది. మీకు పుత్ర సంతానం కలుగుతుంది.’’
‘‘నిజమా?...’’
‘‘ముమ్మాటికీ నిజమే!...’’
‘‘ఐతే, వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లుగావించండి!’’
‘‘మొదట ఋశ్యశృంగుని భార్యాసమేతంగా ఆహ్వానించండి. వారి పాదస్పర్శతో మనకోసల సుభిక్షమవుతుంది. ఆయన ఆధ్వర్యంలో యజ్ఞం నిర్విఘ్నవౌతుంది. ఆయన ఆశీస్సులతో మీకు సంతానం కలుగుతుంది. ఇది తథ్యం!...’’ అన్నాడు.
‘‘్ధనోస్మి!’’ అంతకన్నా కావాల్సిందేముంది?... అలాగే పిలిపించండి!’’
యజ్ఞానికి పెద్దఎత్తున ఏర్పాట్లుజరిగాయి. ఋత్విక్కులంతా విచ్చేశారు. ఋశ్యశృంగుడు తన పత్ని శాంతాసమేతంగా విచ్చేసి విడిదిచేశాడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087