Others

పుష్కర భక్తులకు ‘అక్షయపాత్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పుష్కరాలకు వచ్చే భక్తులకు అక్షయపాత్ర అండగా నిలుస్తోంది. రోజూ మూడు లక్షల మందికి పసందైన భోజనం అందేలా ఏర్పాట్లు చేసింది. భారీ కిచెన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని ఇచ్చింది. భక్తులకు ఆహారాన్ని అందించేందుకు అక్షయ ఫౌండేషన్ హరేకృష్ణ మోటివేషన్ ఫౌండేషన్‌తో కలిసి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కర్నూలు, మిర్యాలగూడ, గొల్లపూడిల్లో తాత్కాలిక వంటశాలలను ఏర్పాటు చేసింది. 2 లక్షల 20వేల కేజీల బియ్యం, 250 టన్నుల పప్పు ధాన్యాలు, ప్రతిరోజూ 20 టన్నుల కూరగాయల చొప్పున సమకూర్చుకుంది. సుమారు 250 మంది వలంటీర్లు నిమగ్నం కానున్నారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వంటశాల నుంచి ఉదయం 7 గంటలకు నిర్దేశించిన ప్రాంతాలకు పంపిణీ చేస్తారు. నిర్దేశించిన ఆరు ఘాట్లకు ప్రతిరోజూ 3 లక్షల మందికి సరిపోయే ఆహారాన్ని అందించేందుకు వలంటీర్లు పనిచేయనున్నారు. గురువారం లాంఛనంగా వంటశాలలను సిఎం చంద్రబాబు ప్రారంభించడంతోపాటు వంటకాల రుచులను చూసి అభినందించారు.
ఇదీ మెనూ
పులిహోర, టమాటో రైస్, వెజ్ బిస్మిల్లా బాత్ (సాంబారు అన్నం), చక్రపొంగలి