Others

ఉపవాసాల్లో అంతరార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజాన్ మాసం అనగానే పవిత్రమైన భావాలు అంకురిస్తాయి. ఈ మాసం నిండా దానాలు, ధర్మాలు చేస్తుంటారు. అల్లాను నమ్మేవారంతా ఉపవాసం ఉంటూఉంటారు. ఉపవాస కాలంలో లేనివారికి తమకు చేతనైనంత దానం చేసి వారికి ఎంతో తోడ్పాటును ఇస్తారు. ఈ మాసం 30 రోజులు గడిచిన వెంటనే షవ్వాల్ మాసం ఆరంభవౌతుంది. ఈ షవ్వాల్ ప్రారంభమైన రోజునే ఈదుల్ ఫిత్ అన్నమాట. అంటే ఇది ముస్లిం సోదరులకు అతి ముఖ్యమైన, పెద్ద పండుగు. షవ్వాల్ మాసపు నెలవంకను చూడగానే ఈదుల్ ఫిత్ పండుగను జరుపుకునేలా ప్రకటన ఇస్తారు.
రంజాన్ సమయంలో ఉపవాస దీక్షలతోను, దైవారాధనతోను గడిపిన తరువాత జరుపుకునే పండుగే రంజాన్ పండుగ.
తమకు ఇహపరాల్లో సుఖసంతోషాలతో పాటుగా సకల శుభాలు కలుగాలని, దానితో పాటు సకల మానవాళి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకునే రోజు ఈ రంజాన్ పండుగ.
మానవాళికి మార్గదర్శకమైన పవిత్ర దివ్య ఖురాన్ ను ప్రసాదించినందుకు గాను ఆ దైవం పట్ల కృతజ్ఞతను సమర్పించుకుంటున్న సూచనగా ముస్లిం లోని విశ్వాసులందరూ రమజాన్ మాసంలో ‘రోజా’ లను అంటే ఉపవాసాలను పాటిస్తారు.
రంజాన్ పండుగ రోజు ఆనందోత్సవాలతో బంధుమిత్రుల కుటుంబాలతో కలసి ఈదుల్‌ఫిత్‌న్రు జరుపుకుంటారు. ‘షీర్ ఖుర్మా’ (సేమ్యాల పాయసం) ను తయారుచేసి ఇంటిల్లి పాది సేవించి వారు ఆనందించి ఆ సేమ్యా పాయసాన్ని తమకు చుట్టుపక్కల నివసించేవారికి, పేదవారికి, బంధువులకు, స్నేహితులకు కూడా పంచుతారు. ముఖ్యంగా ఈ పండుగ రోజు పేదసాదలు కూడా సంతోషంగా ఉండాలనితమకు అల్లా ప్రసాదించిన ధనంలో కొంతభాగాన్ని వెచ్చించి కొత్తబట్టలను, మిఠాయిలను పంచుతారు. ఈ రోజున నెలరోజుల నుంచి ఉంటున్న రోజాలను విడుస్తారు. బంధువులతో, కుటుంబ సభ్యులతో కలసి విందుభోజనం చేస్తారు.
ఈ పండుగ రోజు కొత్తబట్టలు ధరించి ఈద్‌గాహ్ కు వెళ్లి అక్కడ ఈద్ నమాజ్‌ను గావిస్తారు. కొంతమంది వారి వారి ఇంటి దగ్గర ఉన్న మసీదులకు వెళ్లి అక్కడ కూడా ప్రార్థనలు జరుపుతారు.
ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం వల్ల మానవ శరీరంలోని రుగ్మతలు కొన్ని దూరమవుతాయి. మానసిక వ్యాధులు సైతం మటు మాయం అవుతాయి. అంతేకాక తాగుడు వంటి వ్యసనాలకు కూడా దూరమవుతారు. కోపం, ఎదుటివారిపై చికాకు కనబర్చడం వంటి వాటిపైన కూడా నియంత్రణ జరుగుతుంది.
ఉపవాస దీక్షలో కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు. చెడు మాటలు వినకుండా ఉంటారు. చెడు మాటలను పలుకరు. చెడు ఆలోచన్లు చేయరు. ఇతరుల గురించి నిందలు చేయరు. ఎవరినీ ద్వేషించరు. చెడు దృశ్యాలను చూడరు. అసత్యం పలుకరు. అందరిలోను అల్లా అంశనే చూస్తుంటారు. ఈవిధమైన నియమాలతో ఎవరు ఈ ఉపవాసం చేస్తారో వారికి తప్పక అల్లా కృప లభ్యవౌతుందని ముస్లింల నమ్మకం.
ప్రతి సంవత్సరమూ ఈ నెలరోజులు పాటించే ‘రోజా’ వల్ల జీవితంలో ఎప్పుడుకూడా చెడునడతకు దగ్గరయ్యే అవకాశం ఉండదు. మంచితనాన్ని మానవత్వాన్ని పెంపొందించుకుంటారు.
షబ్బెఖదర్ దైవారాధనలో గడిపే రాత్రి అన్నమాట. ఉపవాసం ఉండే నెలరోజుల్లో చివరిభాగంలోని బేసి రాత్రుల్లో అంటే 21, 23, 25, 27, 29 ఈ ఈ రోజుల్లో రాత్రిపూట దైవారాధన చేస్తుంటారు.
సమస్త మానవాళి సత్యమార్గంలో నడవాలని, మంచి సమాజం ఏర్పడాలని, మానవులంతా సత్ప్రవర్తన కలిగి దైవభీతిని కలిగి నడుచుకోవాలనే అంతరార్థం ఈ పండుగ లో కనబడుతుంది.
నియమ నిష్ఠలతో ముస్లిం సోదరులంతా రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి చివరి రోజు పండుగ జరుపుకుని సంతోషాలను పొందుతారని ఆశిస్తూ

షహనాజ్ 9849229766