Others

శోభన్ స్ఫూర్తితో ఎదిగిన మురళి( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరో కొత్త హీరోట...
బొమ్మలా వున్నాడట... చాలా బాగా చేశాట్ట... ఎవరో అనుకొంటున్నారు. అది దాసరి చిత్రం -్భరతంలో ఒక అమ్మాయి. సినిమా చూశాను. చాలా బావుంది. హీరోయిన్ రోజారమణి. అడ్రసు సంపాదించి లెటరు రాశాను. సినిమావాళ్లకు లెటర్రాస్తే తిరిగి సమాధానం రాస్తారా? మన పిచ్చిగాని అని మరిచిపోయాను. సరిగ్గా నాలుగోరోజుకే సమాధానం వచ్చింది. నా లెటరుకి తబ్బిబ్బయిపోతూ. హాండ్ రైటింగ్ బావుంది. అందంగా ప్రతి అక్షరం అర్థమైనట్టు వుంది. పైగా లెటరు చివర్లో నా సమాధానం సిన్సియర్‌గా ఆశిస్తున్నట్టు రాశాడు. అప్పుడు మద్రాసు టి నగర్‌లో ప్రకాశ్‌మొదలి వీధిలో వుండేవాడు. మురళి సినిమా చూసి ఆ సినిమాని ‘రివ్యూ’ చేసి... ఇంకా వివరంగా చెప్పాలంటే పోస్ట్‌మార్టమ్ చేసి పంపించేవాడ్ని. అప్పుడు నేను కాకినాడలో వుండేవాడ్ని. మామధ్య ప్రతి నాలుగురోజులకో ఉత్తరం. అందులో విలువైన సమాచారం చోటుచేసుకొనేది.
ఒకరోజు ఉత్తరం వచ్చింది. స్వర్గం- నరకం ఫంక్షను కాకినాడలో జరుగుతుంది. యూనిట్ అందరం వస్తున్నాం. వీలయితే కలవండి’ అంటూ మురళి లెటరు రాశాడు. నేను ఓ ప్రైవేట్ బ్యాంకులో డివిజనల్ మేనేజర్‌గా పనిచేసేవాడ్ని. ఆ ఉత్తరం అందిందో లేదో ఇంటి దగ్గర్నుంచి కబురు వచ్చింది. మురళి ఇంటికొచ్చాడని- ఆశ్చర్యపోయాను. హడావుడిగా ఇంటికెళ్లేసరికి మురళి పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. అప్పటికే మా కుటుంబాల మధ్య వరుసలుపెట్టి పిలవడం అలవాటైపోయింది. చెల్లెమ్మగారూ! అంటూ స్వంత చెల్లెలులా చూసుకొనేవాడు. ఆరోజు సూర్యకళామందిర్‌లో స్వర్గం నరకం ఫంక్షను చూశాం. శాంతాభవన్‌లో గురువుగారికి పరిచయం చేశాడు. దాసరిగారికి నామీద ప్రేమా వుంది. నా రివ్యూలకి కోపం వుంది. నేను కనిపించేసరికి చాలా విషయాలు మనసు పంచి మాట్లాడుకున్నాం.
‘జ్యోతి’ సినిమాలో స్టిల్ పంపించాడు లెటరుతోబాటు. ఆ ఫొటో అచ్చు శారద సినిమాలో శోభన్‌బాబులా వుంది. చాలా హాపీగా ఫీలయ్యాను. అక్కినేనిని శోభన్ ఫాలోఅయ్యాడు. శోభన్‌ని మీరు ఫాలోఅవ్వండి. తిరుగుండదు! అని చెప్పేను. అన్నదమ్ముల అనుబంధంలో యన్‌టిఆర్ తమ్ముళ్లుగా మురళీ, బాలయ్యబాబు నటించారు. మురళి పక్కన జోడి లత. మంచి డ్యూయెట్ వుంది. గులాబీ పువ్వై నవ్వాలి మనసు! ఆ సినిమా హిట్. వరుసగా మురళి సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వస్తోంది.
నేను మద్రాసు వెళ్లడం. ఓ సినీ వారపత్రికకి రిపోర్టర్‌గా పనిచేయడం జరిగింది. అయితే ఏరోజూ కలవలేదు. ఆ రోజుల్లో నటీనటుల చుట్టూ రిపోర్టర్లు తిరిగేవారు కారు. రిపోర్టర్ల చుట్టూ నటీనటులు తిరిగేవారు. ఒక కుటుంబ సభ్యుల్లా అందరూ కలిసిమెలిసి వుండేవారం. ఎప్పుడయినా మురళీ గురించి రాయవలసి వస్తే నాకు తెలిసిన సమాచారం చాలు- నిజానికి ఓ పుస్తకం రాయగలను.
ఒకరోజు దాసరి ఇంటిదగ్గర కలుసుకున్నాం. ‘ఇప్పుడు సరైన దారిలో పడ్డారు. మీకు డైరెక్షను డిపార్ట్‌మెంట్ మంచిది. ఎపుడైనా నా సహాయమవసరపడితే సంకోచించకండి!’ అన్నాడు. అప్పటికే స్వంత బ్యానరులో సినిమాలు నిర్మిస్తున్నాడు. జయభేరి సంస్థకి రాజాచంద్ర దర్శకుడు. రాజాచంద్ర విజయబాపినీడు సినిమా ‘బొమ్మరిల్లు’తో సక్సెస్‌ఫుల్ డైరెక్టరుగా మారాడు.
నేను ‘ముద్దుల చెల్లెలు’ సినిమా చేస్తున్నాను. రంగనాథ్ ఒక హీరో. మీరో హీరో’ అన్నాను. నిజానికి ఈ మాటలు చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ విషయాలన్నీ నాకనవసరం. మీరు డైరెక్ట్ చేస్తున్నారు. నేను చేస్తున్నాను- రెమ్యూనరేషన్ విషయం మర్చిపోండి! అంటూ వెన్ను చరిచి ప్రోత్సహించారు.
శోభన్‌బాబుకి మురళి చాలా సన్నిహితుడు. మాట్లాడేతీరు, ఆలోచనా సరళి- ఎదుటివారిని నొప్పించకుండా వుండటం. ముఖ్యంగా ఇవన్నీ శోభన్, మురళిలో సమాంతరంగా వుంటాయి. ఆయన మార్గంలోనే పయనించాడు. నిజానికి ఆయన్ని మించిన వాడయ్యాడు. ఈరోజు ఓ పార్లమెంటేరియన్‌గా వెలుగొందుతున్నాడంటే- అది స్వయంకృషి. సరైన వ్యూహ రచన, అనితర సాధ్యమైన ఆచరణ.. ఇన్నీ కలబోస్తే మూర్త్భీవించిన రూపం మురళీమోహన్!

-ఇమంది రామారావు 9010133844