Others

చెమటకాయలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలో ఎక్కువగా తిరిగినా, ఉక్కబోత వాతావరణంలో ఎక్కువసేపు ఉన్నా చెమటకాయల సమస్య మొదలవుతుంది. వేసవికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ చెమటకాయల్లో రకాలు ఉంటాయి. కొన్ని ఎరుపురంగు చుక్కల్లా కనిపిస్తాయి. కొన్ని నీటి పొక్కుల్లా కూడా వస్తాయి. వీటివల్ల దురద, మంట వంటివి వస్తాయి. చెమటకాయలు చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఎండలో ఎక్కువగా తిరిగేవారికి, చెమట ఎక్కువగా పట్టేవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.
* సాధారణంగా మెడ, వీపు ప్రాంతాల్లో చెమటకాయలు ఎక్కువగా వస్తాయి. ఒక్కోసారి ముఖంపైనా, కాళ్ల మడతల్లో కూడా చెమటకాయలు రావచ్చు. వీటిని అశ్రద్ధ చేస్తే అవి పుండ్లుగా ఏర్పడే ప్రమాదం ఉంది.
* చెమటకాయలకు గంధాన్ని మించిన పరిష్కారమార్గం మరోటి లేదు. అయితే మార్కెట్‌లో దొరికే గంధం పొడిని వాడటం కంటే, గంధపుచెక్కను సానపై అరగదీసి పూసుకుంటే చాలామంచిది. చెమటకాయలు వచ్చిన ప్రాంతంలో గంధంలో కొద్దిగా నీళ్లు కలిపి పలుచని పూతలా వేసుకుంటే మంట, దురద తగ్గుతుంది. శరీరం హాయిగా ఉంటుంది.
* గంధంలో చిటికెడు కర్పూరాన్ని కలిపి చెమటకాయలు వచ్చిన చోట లేపనంగా పూస్తే చెమటకాయలు తగ్గిపోతాయి.
* గంధం పొడి, వట్టివేళ్ల పొడిని కలిపి చెమటకాయలపై పలుచని లేపనంలా పూసినా ఉపశమనం కలుగుతుంది.
* గులాబీనీరు, కలబంద గుజ్జుని రాసుకున్నా కూడా చెమటకాయల నుంచి ఉపశమనం కలుగుతుంది.
* చెమటకాయలు మరీ కుచ్చుకుంటున్నట్లు అనిపించినప్పుడు హాయిగా స్నానం చేసి, తడి లేకుండా చూసుకుని పౌడర్‌లను చల్లుకోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.
* వేసవికాలంలో అసలు చెమటకాయలు రాకుండా ఉండాలంటే.. తప్పనిసరిగా రెండుపూటలా స్నానం చేయాలి. శరీరంపై చెమట ఎక్కువగా పట్టినప్పుడు అది శరీరంపై ఆరనివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే చెమటలోని బాక్టీరియా చర్మంలోకి ఇంకిపోయి రాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రెండుపూటలా స్నానం చేయాలి.
* స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపూలు కానీ, జాజిపూలు కానీ, వట్టివేళ్ల చూర్ణం కానీ వేసి గంటసేపు నాననిచ్చి ఆ నీటితో స్నానం చేయడం మంచిది. ఇటువంటి స్నానం శరీరాన్ని చల్లగా, హాయిగా ఉంచుతుంది. చెమట దుర్గంధాలు కూడా పూలల్లోని సుగంధాల వల్ల తొలగిపోతాయి.
* స్నానం చేసే నీటిలో అరచెక్క నిమ్మరసం కలిపి స్నానం చేసినా శరీరంపై ఏర్పడిన బాక్టీరియా తొలగిపోయి, శరీరం తాజాగా, సువాసనభరితంగా ఉంటుంది.
* వదులుగా ఉండే పలుచని నూలు దుస్తులను ధరించాలి.
* వీలైనంతవరకు లేత రంగుల దుస్తులనే వాడాలి. తెలుపు రంగు మరీ మంచిది. ముదురు రంగులను వేసవికాలంలో వాడకపోవడమే మంచిది.
* వేసవి కాలంలో ఎక్కువ మంచినీళ్లను తాగాలి. శరీరంలోని మినరల్స్ అవీ పోయి నిర్జలీకరణ కాకుండా చూసుకోవాలి.
* వేసవిలో దోసెలు, ఉప్మాలకంటే రాగిజావ, ఇడ్లీల వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవడం చాలామంచిది.
* వేసవికాలంలో వచ్చే అన్ని రకాల పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, దోసకాయ, కీర, తాటిముంజెలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకురసం.. ఇలా నీరు ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటూ ఉండాలి. ఫలితంగా శరీరం నిర్జలీకరణకు గురవ్వదు.
* వేసవికాలంలో మసాలాకూరలు, బిర్యానీలకు దూరంగా ఉండాలి. *