Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌసల్యకు నొక కొమరుడు- కైకేయికి నొకరు
కానీ సుమిత్రకు నిర్వురు- కొమరులు కలిగేరు

కడలి పొంగెనన్నట్టుల పొంగెను దశరథుడు
కరిగిపోవు తన కన్నులె సాక్ష్యమ్ములు కాగా

పంచెను ధనధాన్యమ్ముల- పంచెను పంచియల
భూదానం, గోదానం చేసెనన్నదానం

ప్రజల సొమ్ము ప్రజలకొరకు పంచువా ప్రభువు
ప్రజల సొమ్ము తన సొమ్ముగ నెంచువాడె పశువు

తనకు నాల్గు భుజమ్ములే మొలిచినట్లు భావించెను
నలుగురు సూనుల జూచుచు నాలుగింతలాయెను

ఆ కన్నుల ఆనందం కన్నులకే తెలియు
ఆ తల్లుల ఆహ్లాదం తల్లులకే తెలియు

ఊగని ఉయ్యాలలూగె- ఊగె మనసులూగె
ఊయలలో ఊయలవలె- నూగె నగర మూగె

వెలుగులు ఆటాడినటుల వెనె్నల పారాడినటుల
దినినేలె దివిలే భువిపై పారాడి నటుల

ఆ పెదాలపై నవ్వుల మెరపులెన్నొ మెరిసినవి
ఆ కన్నుల కోటి కోటి తారకలే విరిసినవి.

పాలు పొంగెనన్నట్టుల మురిపమ్ములు పొంగెను
ఆ యిల్లే పాలవెల్లి వలె కన్నుల దోచెను

ఆకాశమునంటి భూమి- భూమి నంటి చందురుడు
చంద్రునంటి చకోరము- వలె నుండిరి నలుగురు

నాలుగు దిక్కుల శోభయె ఒకచోటికి చేరినట్లు
ఒక చోటికి చేరి పిదప- నలుదిక్కుల ప్రాకినట్లు

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087