Others

పంచ యజ్ఞములను పాటిస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవ యజ్ఞము -నిత్యాగ్నిహోత్రము చేయుట, పితృయజ్ఞం పితృదేవతల నారాధించుట. మనుష్య యజ్ఞము = అతిథులకు భోజనము పెట్టుట, భూత యజ్ఞము=జంతువులకు ఆహారం పెట్టుట, బ్రహ్మ యజ్ఞము = వేదాధ్యయనమో, గీతాధ్యయనమో చేయుట, గృహస్థుగు వాడీ యజ్ఞములచే, ఆయా దేవతల సంతోషపెట్టుచో అన్ని పాపములనుండి విముక్తుడగును. ఇవి అన్నియు ఫలాపేక్షారహితులై చేయువారు మోయమునకర్హులగుదురు. గృహస్థులు చేయు దోషములు పంచసూనములు పంచవిధ వధలు
ఖండినీ పేషణీచలీ ఉధకుంభశ్చమార్జనీ
పంచనూనా గృహస్థస్వ పంచయజ్ఞాత్ ప్రణశ్యతి
పంచయజ్ఞములు చేయుటవలన పంచసూనాదుల దోషములు నశించుచున్నవి. ఖండినీ= కత్తిపీట, పేషణీ = సనె్నకల్లు, ఛుల్లీ- పొయ్యి, ఉదకుంభము= నీటి కుండ, మార్జనీ =చీపురుకట్ట, ఈ సాధనముల చేత స్ర్తిలు ముఖ్యముగా హింస చేయుచున్నారు. సనాతన ధర్మములు ఈ పంచయజ్ఞములలో నిమిడియున్నవి. ఈ ధర్మములు దగ్ధములైనను ఇంకను మేము సనాతనులమని రొమ్ములు బాదుకొను వారెందరోకలరు. నిత్యాగ్ని హోత్రము, వైశ్య దేవము మానిరి. సూర్యారాధన మానిరి. ఇండ్లలో ఏప్రక్కనో ఉండు అగ్నిని, విద్యావంతులు సయితము జేబులలోనికి ఎక్కించుకొనిరి. పితృయజ్ఞము తల్లిదండ్రులు చెప్పినట్లు వినుట, వారి మరణానంతరం వారి పేరు మీద శ్రాద్ధకర్మ జరుపుట నూటికొరకు తప్ప తక్కిన వారు పెద్దల కింత పెట్టుటయే మానిరి. ఒకవేళ పెట్టినను శాస్త్రోక్తముగా గాక తమ సమయానుకూలముగా పెట్టుదురు. మనుష్య యజ్ఞము ఇంటి కెవరైనను అభ్యాగతులు వచ్చెదరేమో అని 11 గంటల వరకు వేచియుండెడివారు. ఈనాడు ఉదయం 6 గంటలకే శ్రోత్రియులమని గుండెలు బాదుకొనువారు సైతం కాఫీదాసులై పోయిరి. ఎదుటివారి ఆకలిని కనిపెట్టువారు ఎవరు?
భూత యజ్ఞం=మొన్నటివరకు మనస్ర్తిలు ముగ్గను పేరుతో నూకల పిండి చీమలకు వేయుచున్నారు. ఇప్పుడు అలంకారము మారి వీధులో పెద్దపులులని, ఏనుగులని, రథాలని ఆ చీమల నోట సున్నమే కొట్టుచున్నారు. నేతిగినె్నకు చీమలు పట్టనిచో ఆ చీమలను బుద్ధి పూర్వకముగా చంపుతున్న పెద్ద తల్లులెందరో ఉన్నారు కదా. మనం పెట్టలేము. మన ఇంట జొరబడి ఒక్క అన్నకబళము కుక్క తీసుకొని పోవుచో అది మన కంటబడినచో దానికి బ్రతుకు పారాగతము కలదా? ఇంకెక్కడి భూతయజ్ఞము.
బ్రహ్మయజ్ఞము వేదాధ్యయన మెక్కడ? గీతాపారాయణ మెక్కడ? సుందర కాండ చదువులెక్కడ? విద్యావంతుల పిల్లలకు రెనాల్డ్స్ నావల్స్, కాశీ మజలీలు, అధ్యయనం, దంపతులకు కామశాస్త్ధ్య్రానము గావున ఓ గృహస్థులారా! పంచ యజ్ఞములను చక్కగా ఆచరించిన సర్వపాపముల నుండి విముక్తి పొందడు. పుణ్యమార్జించుకొనుడు. నైవేద్యము లేకయే భుజించరాదు. తినేది దేవుని కర్పించక నేదియు తినరాదనియు అట్లు తిన్నచో పాపమే తినుచుంటిమనియు గీత చెప్పుచున్నది. రక్తమాంసాదులను తినవలదనియు, ఏ పదార్థమైనను భగవంతుని కర్పించక తినకూడదనియు చెప్పి ఉన్నారు. హింస చేయవలయునను ఉద్దేశ్యముతో గాక అమితమైన ఆకలిచే బాధ పడుచున్నప్పుడు హింస చేసి తిన్నను దానిని క్షమింతునని భగవానుడు చెప్పి ఉన్నాడు. భగవంతుని ఆజ్ఞలయందు విశ్వాసమున్నచో ఆయన కర్పించక మీరేదియు తినకుడు. ఆయన కర్పించక మీరు తినినచో మిమ్ములను బాధించుటకు పిశాచముల సిద్ధముగనే ఉండును. మీరును స్వార్థలాభులగుదురు.

- వడ్డూరి రామకృష్ణ 7780797588