Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూభారం తమ కూనలె మోయగలవు నింకనంచు
దిగ్గజాలు ప్రసవించుచు తమ కూనలనిచ్చినట్లు

భూమిని కాలూనకుండ పెరిగిరి ఆ బాలురు!
ప్రతి రోజొక పేరంటం! ప్రతి దినమొక వేడుక!

వారి బరువునెరుగబోరు- వారినెత్తుకొను వారలు
ఆనందం బురువుమీద పడువేళల బరువెక్కడ?

ఎటు చూచిన అందమ్మే- ఆనందన నర్తనమ్మె
ఎటు చూచిన శివమ్మే- సత్యం శివ సుందరమ్మె

నామకరణం
ఏ పేరున పిలువలెనొ, ఎరుగరైరి వారలు
ఏ పేరున పిలిచిననూ ‘ఊ’కొట్టెను రాముడు

నామకరణ మహోత్సవం జరిపినాడు రేడు
అందులకై అరుదెంచెను గురువు వశిష్టుండు

నలుగురు బాలకుల జూచి నవ్వె వశిష్టుండు
‘‘పేరెందుకు? పేరులేని వారికె గద పేరు?

నీ కొడుకులు శుభలక్షణ సమన్వితులు చూడు!
విష్ణువు తన వారితోడ జననమందెనేడు!

ఐన లోక మర్యాదను పాటించగ వలయు
వీరికి తగినట్టి పేర్లు మనము పెట్టవలయు

వీడు చూడు నల్లనయ్య నీలి నబ్బు తునక!
పెదవులపై నవ్వునెపుడు వీడబోడు చూడు!

వీడే కద పెద్దవాడు కాబోయెడు రేడు!
రేడు కాడు లోకాలకు రారాజగు వీడు!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087