Others

సహజ పద్ధతులే మేలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి వచ్చిందంటే మామిడి పళ్లు నోరూరిస్తాయి. బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, ఆల్ఫాన్సా, గోవా, కీసర, మల్‌గోబా.. ఇలా వందకు పైగా వెరైటీలు మార్కెట్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. ఆరోగ్యానికి మామిడి చేసే మేలు అంతా, ఇంతా కాదు. ఇందులో పిండిపదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, జింక్.. ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న మామిడి నేడు ఆందోళనకు కూడా కారణమవుతోంది. ఈ మామిడిపండ్లను సహజ సిద్ధంగా మగ్గబెట్టడం లేదు. మామిడి పళ్లు త్వరగా పండేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు వ్యాపారులు కార్బైడ్ వంటి రసాయనాలను విరివిగా వాడుతున్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు వైద్యులు. పళ్లను సహజ పద్ధతుల్లో మగ్గబెట్టకుండా కార్బైడ్ సహా వివిధ రకాల కెమికల్స్ వినియోగిస్తున్న తీరు ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు వైద్యులు. ఈ కెమికల్స్ వల్ల యువతరంలో సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి కెమికల్స్ ఒక్కోసారి కేన్సర్‌కు కూడా దారితీస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది.
సహజ పద్ధతుల్లో మగ్గపెట్టిన పండ్లు రంగుపూసినట్లు అందంగా ఉండవని, గడ్డిలో మగ్గిన పండ్లకు అంత రంగు రాదని చెబుతున్నారు కొందరు రైతులు. వేసవిలో మామిడి పళ్ళు తినకుండా ఉండలేము. కానీ వాటిని ఇలా అసహజ పద్ధతుల్లో మగ్గబెడితే.. వీటిని తినడం వల్ల ప్రజలకు లేనిపోని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
* మామిడిపండ్లను కొనేటప్పుడే ఒకటికి రెండుసార్లు చూసి అవి సహజ పద్ధతుల్లోనే మగ్గించారో లేదో తెలుసుకోవాలి.
* మామిడిపండ్లను పచ్చిగా ఉన్నప్పుడే కొనుక్కుని ఇంట్లోనే సంప్రదాయరీతిలో గడ్డిలో మగ్గపెట్టడం వల్ల కెమికల్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
* మార్కెట్ నుంచి తెచ్చిన మామిడి పండ్లను తినడానికి అరగంట ముందు మంచినీటిలో నానబెట్టాలి. నీళ్లలో మామిడిపండు తేలితే అది సహజంగా మగ్గిన మామిడిపండు అని, నీళ్లలో మునిగితే అది అసహజ పద్ధతిలో మగ్గబెట్టిన పండుగా గుర్తించవచ్చు.
* మామిడిపండును మంచినీళ్లలో నానబెట్టి తినడం వల్ల శరీరానికి వేడి చేయదు. దానిపై కెమికల్స్ ఉన్నా నీళ్లలో నానబెట్టడం వల్ల శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు.
* అంతేకాదు కార్బైడ్ వాడి మగ్గపెట్టిన పళ్ళపై మరకలు కనిపిస్తాయి. కాయను కోసినప్పుడు కూడా లోపల కండ తెల్లగా ఉంటుంది. ఇటువంటి మామిడిపళ్లను తినకపోవడమే మంచిది.