Others

జోలా అల్‌హర్తికి అరుదైన అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోలా అల్‌హర్తి ఓ అరబిక్ రచయిత్రి. ఆమె రాసిన పుస్తకం పేరు 3సెలెస్టియన్ బాడీస్2. ఈ పుస్తకం ఒమన్ దేశ చరిత్రకు ప్రతిబింబం.. ప్రేమకు సంకేతం.. ఈ పుస్తకం ముగ్గురి మహిళల జీవితం.. ఇప్పుడు దానికే 2019 సంవత్సరానికిగానూ 3మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ పురస్కారం2 వచ్చింది. దీంతో ఈ అవార్డు అందుకున్న మొదటి అరబిక్ రచయిత్రిగా జోకా చరిత్ర సృష్టించింది. ఒమన్‌లోని అల్ అవాఫి గ్రామంలో నివసిస్తోన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితాలను ఇందులో వర్ణించారు రచయిత్రి. ఇందులో మయ్య అనే అమ్మాయి ప్రేమలో విఫలమై అబ్దుల్లా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. పనిలో భాగంగా ఆస్మా అనే అమ్మాయి ఒక వ్యక్తిని వివాహమాడుతుంది. ఖావ్ల అనే అమ్మాయి కెనడాకు వలస వెళ్లిన తన ప్రియుడి కోసం వేచి చూస్తుంటుంది. ఇలా ఈ ముగ్గురి జీవితాలు.. సంప్రదాయ, బానిసత్వంతో కూడిన సమాజం నుంచి ఒమన్ పరిణామ క్రమానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇందులో ఒమన్‌లో మునుపు మరుగున పడిపోయిన ఎన్నో జీవితాల గురించి ఎంతో ఊహాత్మకంగా, కవితాత్మకంగా వర్ణించారు. ఈ పుస్తకం బానిసత్వాన్ని స్పృశించింది. ఈ పుస్తకాన్ని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అరబిక్ బోధిస్తోన్న మారిలిన్ బూత్ ఆంగ్లంలోకి అనువదించింది. జోకా గతంలో మూడు నవలలను రచించారు. ఈమె ఎడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో క్లాసికల్ అరబిక్ కవిత్వంలో విద్యనభ్యసించింది. ప్రస్తుతం ఈమె మస్కట్‌లోని సుల్తాన్ క్వాబూస్ విశ్వవిద్యాలయంలో బోధిస్తోంది. ఈమె రచించిన సెలెస్టియల్ బాడీస్ పుస్తకానికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ పురస్కారం లభించింది. ఈ పురస్కారం కింద ఈమెకు 50 వేల పౌండ్లను నగదు బహుమానంగా అందించారు. ఈ మొత్తాన్ని రచయిత్రి, అనువాదకురాలికి సమానంగా అందజేశారు.