Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమ చూచె, దోమ చూచె, విశ్వమెదిరి చూచె
‘‘ఎపుడు వచ్చు మా రాముడు? ఎపుడు చూతు’’ మంచు
ఆ నలుగురి బాల్యం
పామువోలె ముడుచుకొంచు పడుకొను లక్ష్మణుడు
ఆతని పైనను పొరలెను శ్రీరాముండెప్పుడు.

శంఖము పూరించినటుల ఏడ్చునెపుడు భరతుడు
చక్రంవలె దొరలుచుండు శత్రుఘు్నండెపుడు.

నోటన బొటన వ్రేలును శ్రీరాముడు వేసికొనుచు
లోలోపలి లోకాలకు అమృతధారలందించును.

పాదమ్ములబడి వదలడు భరతుడెంత వెర్రివాడొ?
చేయిపట్టుకున్న విడడు. ఎందులకో శత్రుఘు్నడు!

దేవునికైనను బాల్యం-వరమై భాసిల్లునేమొ!
తనను మరచి తనవారల- మరిపింపగ జూచునేమొ!

పెద్దల గుండెల కాలిడ- భుజములపైకెక్కి నిలువ
తలపైనను తాండవించ- బాల్యమ్మేమేలేమో!

బాల్యమ్మున వనమ్మ-వనమన బాల్యమ్ము
జరయందున జవ్వనమ్ము- కోరుకొనదె లోకమ్ము?

ధర్మము వెంటను తక్కిన పురుషార్థములుండునట్లు
ఆమువ్వురు ఆ రాముని నంటి సతము మసలిరి

శ్రీరాముని బాల్యం
కౌసల్యే కనినదో- కడలియె ప్రసవించెనో
ఆకాశమె చీలినదో, సూర్యుడె దిగివచ్చెనో
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087