AADIVAVRAM - Others

అస్వాతంత్య్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవ్వరూ ఎవ్వరిని మెప్పించలేరు..
ఎవ్వరూ ఎవ్వరిని నొప్పించక
గతి తప్పించలేరు!!
మనసులోని భావాలు గొంతుకలో కదిలి కదిలి
గొంతులోవి పెదవిపైకి ఉరికి ఉరికి
ఈ అనంత విశ్వంలో సామాన్యుడి
ఉచ్ఛ్వాస నిశ్వాసలలో
చిత్రంగా కాన్వాయ్‌పై రంగులద్దుకున్నాయి
గుండె గొంతుకలు సర్దుకున్నాయి
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే...
ఈ భావజాలాలు.. ఈ రంగులీను ముఖచిత్రాలు..
చూపరులను కదిలిస్తాయా..
బొమ్మలుగా మిగిలిపోతాయా..
గొంతుకలే రగిలిపోతాయా..
ఎన్నాళ్లీ సంకెళ్లు..
అనుకున్నది చేయలేని
చేయలేదని చెప్పలేని
ఈ అప్రజాస్వామిక దౌర్జన్యం.. వౌనం..
దశాబ్దాలుగా ఎదురుచూసినా..
బలవంతుడు బలహీనుని అణచివేతలు
విధివ్రాతగా తలచి రాజీపడి బ్రతకటమేనా
ఎదిరించి ఆ మింటికి చనటమేనా??

-ఆఛార్య క్రిష్ణోదయ 7416888505