Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరకలెత్తు సంద్రమ్మే ఊయలలో నూగెనో
తురంగమై తరంగమే భువిని దొరల సాగెనో

కాడచేత పిందెయటుల- పూవుచేత మొగ్గయటుల
కొమ్మచేత రెమ్మ యటుల - రెమ్మచేత చివురట్టుల

పెరిగినాడు శ్రీరాముడు
ముద్దుగ ముగురమ్మలకడ.

నా కొడుకను కౌసల్యయు- నా కొడుకను సుమిత్రయు
నావాడే వీడంచును వీడ బోదు కైకేయి.

కనినది కౌసల్య కాని- పెంచెనతని కైకేయి
క్షణమైనను వీడకుండ పెనవేసుకు పోవును.

చీకటి ఒడిలో నిరతము భానుడు తిరగాడినట్లు
నల్లనమ్మ కైక ఒడిసి నల్లనయ్య పెరిగెను.

దశరథునకు పుత్త్రులందు రాముడనిన ప్రాణం
అన్ని విడిచి రామునితో గడుపునెల్ల కాలం.

అతడు విడువడారాముని- రాముడతని వీడబోడు
ఒక ఆత్మయె ఇరువురిలో నుండె ననగ నుండిరి.

మట్టిలోన దొరలుచుండు- మట్టినొడల పూసికొనును
మట్టిని తలపై పోసుకు మట్టిముద్దయై పోవును.

తండ్రి చాప చేతులలో- ఒదిగిపోవు రాముడు
తటములందు ఒదిగిపోవు ఒక నదీ ప్రవాహమనగ.

అటుల మట్టి దొరలువాని నెత్తుకున్న దశరథుండు
భూగోళము నెత్తుకున్న రాజరాజువలె దోచును.

భూమియె తానైనవాడు- భూమిపైన ప్రాకనేర్చు
ద్వారమె తానైనవాడు- ద్వారమ్ముల దాటనేర్చు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087