Others

స్మరణతోనే అభయం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివాంశ సంభూతుడుగా అంజనీదేవి గర్భాన ఉదయంచిన కేసరి నందనుడు ఆంజనేయుడు. సూర్యుని అభిముఖంగా నిలబడి నడుస్తూ హనుమంతుడు సూర్యుని దగ్గర విద్య నార్జించాడు. తన అన్న యైనా కూడా వాలి చేతభయపడి దేశమంతా గోష్పాదమంత స్థలం కూడా మిగల్చకుండా తిరిగి తిరిగి వేసారిన సుగ్రీవునితోపాటుగా ఆయనకు అండగా అంజనీసుతుడు నిల్చున్నాడు. చివరకు సుగ్రీ వుడు పంపానదీ సరోవరం దగ్గర ఉన్న ఋశ్య మూక పర్వతం ప్రాంతం తన నివాసంగా మార్చుకున్నాడు. దీనికి కారణం మాత్రం మతంగ ముని శాపానికి భయపడిన వాలి ఋశ్యమూకానికి రాడన్న నిశ్చింతే.
ఒకరోజు సీతానే్వషణలో ఉన్న రామ లక్ష్మణులను చూసిన సుగ్రీవుడు వారు వాలి పంపిన వారుగా, తలిచి భయపడుతుంటే హనుమన్న ముందుకు వెళ్లి ఆ రామలక్ష్మణుల ద్వయంతో మాట్లాడాడు. మొదటి చూపులోనే, మొదటి మాటలోనే ఆంజనేయుడు నవ వ్యాకరణ పండితుడని, శుభదృష్టి కలవాడని, అమేయ బలపరాక్రమాలున్న ధీరుడని రాముడు అనుకొన్నాడు. లక్ష్మణుడు కూడా ఇతను సోదరుని వలె స్నేహం చేస్తే బాగుండు అనుకొన్నాడు. ఆ ఆంజనేయ స్వామి నే శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథినాడు జన్మించారని శాస్త్రాలు చెబుతున్నాయ.ఈ వైశాఖ బహుళ దశిమి ని హనుమజ్జయంతిగా భావించాలని పరాశర సంహిత చెబుతుంది. దశమినాడు, మంగళ, శనివారాల్లో ఆంజనేయుని స్మరించడం, పూజిం చడం చేయాలని ధర్మసింధువు తెలియ చేస్తోంది.
అసలు ఆంజనేయస్వామిని చిన్నాపెద్దా, కులమత జాతి విద్వేషాలను ఏమీ లేకుండా జనులందరూ జయహో ఆంజనేయ జై భజరంగభళీ అంటూ పూజిస్తారు. ఆంజనే యుని స్మరిస్తే చాలు భూత,ప్రేత పిశాచ గణాలు కూడా దూరమవుతాయని, బాలా రిష్టదోషాలు కూడా నశిస్తాయని చిన్నపిల్లల మెడల్లో ఆంజనేయస్వామి రూపును ధరింపచేస్తారు. ఆంజనేయుడు అరటి చెట్టు మొదట్లో కూర్చుని రామధ్యానం చేస్తుంటాడని పురాణ వచనం.
సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన ఆంజనేయుడుచిన్నప్పుడు సూర్యుని చూసి పండు అనుకొని అందుకోబోయాడట. సూర్య మండలానికి వస్తున్న వానిని చూసి ఇంద్రుడు ఎవరో శత్రువనుకొని తన వజ్రాయుధాన్ని ఆంజనేయునిపై విసిరాడట.
ఆ దెబ్బకు స్పృహతప్పి పడిపోతే వాయు దేవుడు ఉగ్రుడై వాయువును స్తంభింప చేశా డట. దాంతో ప్రాణులన్నీ అల్లాడిపోతుంటే బ్రహ్మాది దేవతలు వచ్చి వజ్రాయుధమే కాదు ఏ ఆయుధం వల్ల ఆంజనేయునికి బాధకలుగదు అని అభయం ఇచ్చి నాటి నుంచి హనుమం తునిగా పిల్వబడుతాడు అని చెప్పారట. అపుడు తల్లిదండ్రులైన అంజనీకేసరులు ఆనం దించారు. దేవతలు ఇచ్చిన వరాలతో ఆంజ నేయుడు చిరంజీవిగా ఉంటాడన్న తలం పుతో వాయుదేవుడు ఆగ్రహాన్ని తగ్గించుకుని ఆంజనే యునికి వేయ ఆశీర్వచనాలిచ్చాడట.
సుగ్రీవునికోసం రామలక్ష్మణులతో మాట్లాడిన ఆంజనేయుడు వారి స్నేహ సౌజన్యం చూసి వారిమధ్య ఉన్న భాతృ ప్రేమను చూసి రాముని గుణ గణాలకు మురిసి పోయ రామునికి బంటుగా ఉండాలను కొన్నాడట. రాముడు భార్యావియోగంతో బాధ పడుతుంటే ఆంజనేయుడు కూడా సీతా మాతను వెదకడానికి సుగ్రీవుని ఆజ్ఞతో వెళ్లాడు. సముద్ర లంఘనం చేసి లంకలో ప్రవేశించి రావణుని అశోకవనంలో బంధీగా ఉన్న సీత మ్మను చూసి వచ్చి రామునికి సీతమ్మ క్షేమ వార్తను చెప్పి ఆయన్ను ఆనందంలో ముం చాడు. అందుకే రాముడు ఆంజనేయుని కౌగి లించుకుని నీ ఋణాన్ని నేను తీర్చు కోలేను అన్నాడు. రామలక్ష్మణులు వానరు లతో కలసి లంకపై దండెత్తి సీతమ్మను తీసుకొని వచ్చి అయోధ్యకు వెళ్లారు. ఇక అప్పటి నుంచి రామ య్య చెంతే అంజన్న కొలువుదీరి ఉంటాడు. రాముని భక్తులను తనకు తానే కాపాడు తుంటాడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తానుండి రామనామం పలికేవారని అనుక్షణమూ కాపాడుతుంటాడు.
రామాయణ పఠనం చేసేవారికి అండదండగా తోడునీడగా ఉంటాడు. ఆంజ నేయస్వామికి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియం. సహస్ర నామార్చన, అష్టోత్తరములతో పూజచేస్తే శుభం కలుగుతుంది. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటిపండ్ల నివేదన, సింధూ ర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. మంత్రాలను సిద్ధింపచేయడం లో కూడా హనుమంతుడు సాధకులకు అను కూలంగా ఉంటాడని ప్రశస్తి.

- చారు