Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారమె తానైనవాడు- ద్వారమ్ముల దాటనేర్చు.

మాటయె తానైనవాడు- మాటలెన్నొ నేర్వజూచు
నడకెయె తానైనవాడు- నడక తాను నేర్వజూచు.

నాట్యమె తానైనవాడు- నాట్యమాడగా జూచును
పదము తానెయైన వాడు- పదము పొడజూచును.

పక్షివోలె నెగురజూచు- పామువోలె పారును
చేపవోలె నీదజూచు- మనిషివోలె నేడ్చును.

నీరుత్రాగి మేఘమట్లు గర్జనమ్ము సేయును
ఋషివోలెను కళ్ళమూసి, ధ్యానమ్మున మునుగును.

రాముడు పారాడ భువిని- పారాడెను ధర్మమ్మే
అతడు లేచి నిలబడగా- లేచి నిలిచెనతని యూత.

ఆకాశం కౌగిలిలో భూమి ఆడుకొనినట్టుల
భూమి గుండెలను గగనం ఆడుకొనియెన్నట్టుల

ఆడుకొనియె శ్రీరాముడు- ఆటకె అందమ్మనగా
పాడుకొనియె శ్రీరాముడు- పాటకె అందమ్మనగా.

ఆడించెడు వాడట్టుల- ఆటలందు తేలువేళ
లోకములే చోద్యమ్ముగ చేష్టలుడిగి చూచెను.

తాతతో భేటీ
వచనం: ఒకరోజు తూర్పువాకిలిని తెరుచుకొని, పారాడుతూ వచ్చి, రాముడున్న ద్వారంవద్ద ఆగిపోయాడు సూర్యుడు, నీలి నీలి సూర్య బాలకున్ని చూడ్డానికి!
రాముడు నవ్వాడు. నీలాలు ‘గలగల’మని దొర్లినట్లుగా ఉందా నవ్వు. సూరీడూ నవ్వాడు. పగడాలు పలికినట్లుగా ఉందా నవ్వు.
రాముని బుగ్గను గిల్లేడు సూర్యుడు. సూర్యుని చేలాంచలాన్ని పట్టుకు లాగాడు రాముడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087