Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసుర వౌతమోగుణ మునంతకు నంతకు లోగొనంగ హృ
ద్వాసము జేయు, దాని నడపందగు యత్నము జేయు రాజసం
బీసమఘర్షణమ్ము వికసింపగ నీయదు శుద్ధ సత్వమున్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

త్రాసపు మంత్ర పాఠమును ధర్మము తప్పిన మంత్ర తంత్రముల్
అసర గాని సంతతి, రసార్ద్రత లేని కవిత్వ తత్వమున్
మాసిన క్రొత్త వల్వలును మానత్యనందగ నీయవమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీసరస్వతీ!
దోసములెన్నొ జేసి కడు దుందుడుకైవన మందు సొచ్చి హిం
సా సరణిన్ దురాత్ముడయి సద్గురు సంగతి నంది బ్రహ్మ వి
ద్యాసము దీర్ణుడై వెలసెనాది కవీంద్రుడు గాన సద్గురో
పాసన గల్గునట్లుగ కృపన్ వరమీయవె తల్లీ రుూ శ్వరీ
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

కూసము వీడి పాము బరగున్ కడు తేలికగా జరింపగన్
కాసుల కాంచనమ్ములను కాంత సుఖంబుల కాలదన్ని స
న్యాసము బొందు మానవుడె నైహిక బంధ విముక్తుడయ్యెడున్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342