Others

ఇ ఫర్ ఇంద్రాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడో కన్నడ దేశంలో పుట్టింది ఇంద్రాణి 1942లో. కేశవరాజు, కృష్ణవేణి దంపతుల ముద్దుల పుత్రిక. నలుగురు అన్నదమ్ములు, ఒక అక్క. నాలుగో తరగతి వరకే చదువుకుంది. కారణం -ఆమె ఆలోచనలు పద విన్యాసం కంటే పాద విన్యాసం చుట్టూనే తిరుగుతుండేవి. బాల్యం నుంచే నృత్యమంటే అభిమానం. ఆమెకది -దైవ సమానం. చూసే కళ్లకు మాత్రం అదో పిచ్చి. ఎవరేం అనుకుంటేనేం అనుకున్నారో ఏమో -వేసే తొలి అడుగుల్లోనే విన్యాస అనుభూతి పొందేది ఆమె. ఇక్కడ ఆమెకు భగవంతుడు తల్లిదండ్రుల రూపంలోనూ ఎదురయ్యాడు. విద్య అంటే చదువుకోవడమే కాదు, కళను అభ్యసించడమేనని నమ్మిన తల్లిదండ్రులు -ఇంద్రాణిలోని ప్రతిభను ప్రోత్సహించారు. మద్రాసు తీసుకెళ్లి గురువు వేణుగోపాలస్వామి వద్ద నృత్యం నేర్చుకోవడానికి కుదిర్చారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని అనేక రంగస్థల నృత్యాలను ఔపోసన పట్టింది ఇంద్రాణి. డాక్టర్ గరికపాటి రాజారావు నాటక సమాజంలో చేరి అనేక నాటకాలూ వేసింది. తొలినాళ్లలో కన్నడతప్ప మరే భాషా సరిగా రాకపోవడంతో -తెలుగేతర మహిళ, పరాయి రాష్ట్ర వనిత పాత్రలు ఏమున్నా ఇంద్రాణినే వరించేవి. అలా ఓ నాటక సమాజం ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు నాటకంలో ఆంగ్లో ఇండియన్‌గా కనిపించారు ఇంద్రాణి. 1956నుంచి నాటకాలే ఆమె ఊపిరైంది. అలా మూడేళ్లు గడిచిపోయాక -నటుడు వల్లం నరసింహారావుతో వివాహం జరిగింది. అదే సమయంలో నటుడు పద్మనాభం, వల్లం నరసింహారావు కలిసి రేఖ అండ్ మురళి పతాకంపై అనేక నాటకాలు వేశారు. ఆ తరువాత సినిమాలు రూపొందించారు. -‘అది దేవత సినిమా రూపొందించే సమయం. వేషం అంటే ప్రాణం పెట్టేసే పద్మనాభానికి ఎలాగైనా హిట్టందించాలన్న సంకల్పానికి వచ్చారు అతని మిత్రులు. అందుకోసం తన పర భేదాలు మర్చిపోయి పనిచేశారు. ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించారు’ అని గుర్తు చేసుకున్నారు ఇంద్రాణి. -‘ఆ టైంలో ఎస్‌వి రంగారావు, ఎన్టీఆర్, సావిత్రిని మా సమాజం మొత్తం వెళ్లి కలిసింది. ఓ మంచి వ్యక్తి మనసుపెట్టి ఓ మంచి సినిమా చేస్తున్నాడు. సినిమా బాగా రావడానికి మీవంతు కృషి చేయండి’ అంటూ రిక్వెస్ట్ చేసి కృషి చేశామని గుర్తు చేసుకున్నారు ఇంద్రాణి. పెళ్లైన తరువాతా భర్త వల్లం నరసింహారావుతో కలిసి అనేక చిత్రాల్లో నటించారు ఇంద్రాణి. అదేవిధంగా మాతృభాష కన్నడంలో హీరో రాజ్‌కుమార్ సరసన దాదాపు పది చిత్రాల్లో నటించారు. దశావతారాల్లో కృష్ణుడిగా నటించి తెలుగు, కన్నడ ప్రేక్షకులను మెప్పించారు. రాజశ్రీ రాధగా అభినయిస్తే, ఇంద్రాణి కృష్ణుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. మా పెద్దబ్బాయి పుట్టినపుడు రాజారావు పోవడంతో ఆయన గుర్తుగా అదే పేరు పెట్టుకున్నామంటారామె. నృత్యాలు, నాటకాలపైనే ఎక్కువ ఏకాగ్రత నిలిపారామె. కన్నడంలో ‘కైవార మహత్మ్య’, ‘శ్రీశైల మహత్మ్య’ చిత్రాల్లో ఆమె పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా శ్రీశైల మహత్మ్యలో మోహినిగా ఇందిరా వల్లం నటన ఎన్నదగింది. రాణీకాసుల రంగమ్మ, భూమికోసం, యువతరం కదిలింది, నవోదయం, ఇది మా ఇంటాయన కథ, దేవి లలితాంబ, మంచివాడు, నిజం నిరూపిస్తా వంటి చిత్రాల్లో ఇంద్రాణి తన ప్రతిభను ఆవిష్కరించారు. ఎక్కువ భాగం చిత్రాల్లో డాన్స్ కంపోజిషన్‌కే తన ప్రతిభనంతా వెచ్చించారామె. ‘నా పెళ్లి జరిగినప్పుడే నటుడు పెరుమాళ్లు ఓ పలక కొనిచ్చారు. నీకు తెలుగు చదవడం రాదు కనుక ఈ పలకపై అ, ఆలు దిద్దుకోమని బహుమతిగా ఇచ్చారు. తరువాత తెలుగును చక్కగా చదివేలా నేర్పినవారు నటుడు కాకరాల. గరికపాటి రాజారావు కూడా రోజూ దినపత్రిక చదువుతూవుంటే చక్కని తెలుగు వస్తుందని చెప్పేవారు. చాలా పుస్తకాలు కొనిచ్చేవారు. అలా పుస్తకాలు చదవడం ఓ పిచ్చిగా మారింది. అలా తెలుగును చక్కగా మాట్లాడగలిగాను. అదేవిధంగా తమిళం చదవలగను, రాయగలను అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారామె. అక్కినేని నాగేశ్వరరావుతోనూ కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించాను. నటనలో ఆయన నాకు గురువులా తోచేవారు. అదేవిధంగా ఎన్టీఆర్‌తోనూ చేయడంతో మంచి సలహాలిచ్చేవారు. ఇహ కన్నడ హీరో రాజ్‌కుమార్‌కు నేను చిన్నప్పటినుంచీ తెలుసు. అందుకే ఎప్పుడు కనిపించినా ‘ఇంద్రాణీ.. చెన్నాగిదియా’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు ఇంద్రాణి. ఇక పెళ్లికాకముందు నాకు ఒక కాంగ్రెస్ పార్టీ గురించే తెలుసు. పెళ్లయ్యాక ఆయన విప్లవ భావాలకు కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనేదాన్ని. నాకు మొదట ఏదీ అర్థమయ్యేది కాదు. అసలు కమ్యూనిస్టు పార్టీ అంటే ఏమిటో కూడా తెలిసేది కాదు. కానీ నా చుట్టూవున్న సమాజంలో అదీ ఒక భాగమని అర్థమయ్యాక తెలుసుకోవడం ప్రారంభించాను. ఇద్దరూ కళాకారులం అవ్వడంతో ఎవరి షెడ్యూల్ వారికుండేది, ఎవరి డబ్బింగ్ వారికుండేది. నా పని నాదే, ఆయన పని ఆయనదే. ‘మా’లో మెంబర్‌గా ఉన్నారాయన. ఇపుడు పెద్ద నటులుగా మారిన షాలిని, రిషి, బేబి షామిలిలాంటి వాళ్ళంతా నా దగ్గరే పెరిగారు. ఇక నాకు ఇండస్ట్రీలో మంచి స్నేహితురాలు అలనాటి నటి సీత. ఇప్పటికీ మామధ్య అదే స్నేహం కొనసాగుతోంది. తొలినాళ్ళల్లో వాణిశ్రీ, విజయలలితకు కూడా నేను డ్యాన్స్ మూమెంట్స్ నేర్పించాను. చెన్నైనుండి హైదరాబాద్ వచ్చేశాక మావారి ‘మా’ సభ్యత్వం మెంబర్‌షిప్ నాకిచ్చారు. నాకు ముగ్గురు పిల్లలు, పెద్దబాబు రాజారావు కెమెరామెన్. రెండోబాబు కళాధర్ డ్యాన్స్ మాస్టర్. లారెన్స్ దగ్గర డ్యాన్సర్‌గా వర్క్ చేస్తున్నాడు. పాప పేరు సమతారెడ్డి. ప్రస్తుతం ‘మా’ అసోసియేషన్ వారే నెలకు 3 వేలు పింఛన్ అదిస్తున్నారు. శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్నపుడు కూడా 2 వేలు ఇచ్చేవారు. ఓరకంగా ఇపుడు అదే ఆధారంగా మారింది. ఇప్పటి సినిమాలు ఎలా ఉన్నాయని మీరడుగుతున్నారు. ఇప్పటికాలానికి తగినట్టే ఉన్నాయి. ముఖ్యంగా డబ్బింగ్ విషయంలో ఇంగ్లీష్ వచ్చినావిడ తెలుగులో మాట్లాడితే అదో సరికొత్తగా ఉంటుందన్న భావనతో అలాగే ఉంచేస్తున్నారు. దాంతో స్పష్టత కొరవడుతోంది. టెక్నాలజీ పెరిగిపోయాక అన్నీ సులభమయ్యాయి. అప్పటి కష్టాలు ఇప్పుడు లేవు. అప్పుడు గ్రూప్ డ్యాన్సర్లు కూడా చక్కని అందం, అభినయంతో క్లోజప్ షాట్స్‌లో కనిపించేవారు. ఇపుడు వాళ్లెక్కడో దూరంగా వుండి నృత్యం చేస్తున్నారంతే. మొత్తంగా నేచురాలిటీ అనేది మాయమైంది. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా వుంది అంటూ ముగించారు ఇంద్రాణి ఉరఫ్ ఇందిరా వల్లం.

-సరయు శేఖర్, 9676247000