AADIVAVRAM - Others

భక్తజనులకు పెద్దమ్మ.. పసిబాల చిన్నమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తజనుల కోర్కెలు తీర్చే పెద్దమ్మ పసిబాల చిన్నమ్మ ఆలయం అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామ పరిసరాల్లో వున్న తుమ్మలామల దుర్గం వద్ద వెలసింది. 4రోజుల పాటు భక్త జనసందోహం మధ్య పరుష నిర్వహిస్తారు.
పూర్వీకులు, చిన్నమ్మ వంశీకులు తెలిపిన ప్రకారం పసిబాల చిన్నమ్మ చరిత్ర..
పసిబాల చిన్నమ్మ వంకరకుంట గ్రామ పరిధిలోని నల్లపల్లికి (ప్రస్తుతం ఆగ్రామం లేదు) చెందిన భూమన చౌడమ్మ, భూమన పెద్దన్న గౌడ్ దంపతుల 7వ సంతానం. చిన్నమ్మకు ఏడేళ్ళ వయసులోనే అదేగ్రామానికి చెందిన మేనమామ వరుస అయిన జంపన ఓబయ్యకిచ్చి వివాహం చేశారు. అప్పట్లో చిన్నమ్మకు కూడాఅత్తింటి వేదింపులు తప్పలేదు. చిన్నమ్మ చిన్నవయస్కురాలు కావడంతో ఆమె అత్త సూటిపోటి మాటలు, వేదింపులకు ఆమె తట్టుకోలేకపోయేది. ప్రతిరోజూ తన అత్తపెడుతున్న హింసను గుర్తుకు తెచ్చుకుంటూ తనకెందుకిలాంటి జీవితం ఇచ్చాడు దేవుడని బాధపడేది. తానెలాగైనా ఈ హింసనుంచి బైట పడాలని నిర్ణయించుకుంది. ఓరోజు గడ్డికోసం అని వెళ్ళి మల్లమ్మ కొండలో అక్కదేవతలు కొలువైవున్న బోదుగుండులోగుదొన వద్దకు వెళ్ళి తన బాధనంతా అక్కదేవతలతో చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు ఈజీవితం చాలని వైకుంఠం ప్రసాదించాలని వేడుకుంది. అక్కదేవతలు చిన్నమ్మ బాధను చూసి ఎలాగైనా ఆమె ఆలోచనను ఏమార్చాలని చిన్నమ్మతో కాసేపు పగిడికాయల ఆట ఆడారు. కష్టాలు, సుఖాలు రెండూ వుండేవే జీవితం అని మంచి రోజులొస్తాయని అక్కదేవతలు చిన్నమ్మకు నచ్చజెప్పారు. అయినప్పటికీ తనకీ జీవితం నుంచి విముక్తి ప్రసాదించాలని పట్టుబట్టి అక్కదేవతల వద్ద రోదించింది చిన్నమ్మ. అక్కదేవతలు చేసేదేమీ లేక ఉగాది పండుగ రోజున తమవద్దకు రావాలని నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు. తన జీవితం చాలించుకోవాలని ప్రతి రోజూ వేచి చూస్తున్న ఉగాది పండుగ రానే వచ్చింది. ఆ రోజున ఓ సమయంలో తన ఇంట్లోని పనిమనుషులైన మలిసాని కదిరెప్ప, ఊరగుండ్ల ఎరికలప్ప, బూడిదన్నలతో కలిసి తానుకూడా గడ్డితీసుకురావడానికి వెళ్తానని తన అత్తకు చెప్పి మల్లమ్మ కొండకు వెళ్ళింది. తనవెంట వున్న పనిమనుషులను కొండలోకి పురమాయించి వారి కంట పడకుండా అక్కదేవతలు కొలువైవున్న బోదుగుండుదొనవద్దకు వెళ్ళి తనకు వైకుంఠ పదవిని ఇవ్వాలని ప్రార్థించింది. ప్రతి కష్టం తర్వాత సుఖం వస్తుందని ఇంటికి వెళ్ళమని చిన్నమ్మను అక్కదేవతలు పదేపదే చెప్పినా కూడా చిన్నమ్మ వినకుండా తనకీ జీవితంనుండి విముక్తి చేసి వైకుంఠపదవిని దక్కించాలని లేదంటే ఆత్మాహుతి చేసుకుంటానని అక్కదేవతలకు తెలిపింది. చేసేదేమీ లేక మల్లమ్మ చెరువులోకి వెళ్ళి స్నానం చేసి రావాలని చిన్నమ్మను అక్కదేవతలు పంపించారు. ఆమె స్నానం చేసే సమయంలో అక్కదేవతలు పులిరూపంలోకి మారి చిన్నమ్మను బెదిరించి అక్కడినుంచి పంపించేయాలని చూసినప్పటికీ చిన్నమ్మ తన పట్టు వదలకుండా భీష్మించడంతో ఒక్కసారిగా పులిరూపంలో వున్న అక్కదేవతలు చిన్నమ్మ గొంతుపట్టి విసిరి పడేసి నీకు ఈ జీవితం నుంచి విముక్తి కల్పిస్తున్నామని, నిన్ను మాలోలీనం చేసుకుంటున్నామని ఆశీర్వదించి అక్కదేవతలు నిష్క్రమించారు. అంతలోనే చిన్నమ్మ కోసం అడవిలో వెతుకుతున్న ఇంట్లో పనిమనుషులైన వారిలో ఒక్కరైన మలిసాని కదిరప్ప కంట పడింది చిన్నమ్మ. రక్తపుమడుగులో వున్న చిన్నమ్మను తన ఒళ్ళోకి తీసుకుని తట్టిలేపాడు. తేరుకున్న చిన్నమ్మ తన ఆరవ అన్న అయిన భూమన ముసలన్న వద్దకు తనను తీసుకెళ్ళమని కదిరెప్పతో చెప్పింది. చిన్నమ్మను ఎత్తుకుని కదిరప్ప ముసలన్న వద్దకు తీసుకెళ్ళి చిన్నమ్మ పరిస్థితిని వివరించాడు. చిన్నమ్మ కొన ఊపిరితోవుండి తనను అక్కదేవతలు వారిలో లీనం చేసుకున్నారని, పుట్టింటి, మెట్టినింటివారు కలిసి తన పేరిట ప్రతి ఏటా పరుష మహోత్సవాన్ని జరుపమని చెప్పి ఊపిరి వదిలింది. ఆమెను మల్లమ్మ చెరువుకు తూర్పున కింది భాగంలో ప్రస్తుతం భవనాశినీ ఆశ్రమ పరిసరాల్లో అంత్యక్రియలు చేశారు. ఆమె సమాధిపై విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారు 700ల ఏళ్ళుగా ఆమెను దేవతగా కొలుస్తూ పరుష జరుపుతున్నారు. చిన్నమ్మ ఆలయం వద్దకు వెళ్ళి భక్తిశ్రద్ధలతో పూజలు జరిపితే ఎంతటి కష్టమైనా దూరమవుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అప్పటి నుంచి ప్రతి ఏటా జరిపే పరుష మహోత్సవానికి అనంతపురం జిల్లా, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తాదులు తరలివచ్చి చిన్నమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.
పరుష విశేషాలు...
దాసంగాలు.. చిన్నమ్మ అమ్మవారి పెట్టెను తనను చిన్నప్పుడు పెంచి పోషించిన కుటుంబీకులున్న బత్తినపల్లి నుంచి చిన్నమ్మ పెట్టెను ఊరేగింపుగా సుమారు 25కిలోమీటర్ల మేర కాలినడకన చిన్నమ్మ ఆలయం వద్దకు పూజారి ఓబుళేసు అనే వ్యక్తి తీసుకొస్తారు.
చిన్నమ్మ ఆలయానికి 5కిలోమీటర్ల దూరంలో వున్న బసిరెడ్డిపల్లిలోని సోమగుట్ట వంశీకులల బావినుండి వంకరకుంట వద్దనున్న సోమగుట్ట వంశీకుల బావి వద్దకు ఎలవ ( అమ్మవారి ఉత్సవ విగ్రహ) గంపు తీసుకొస్తారు. అక్కడ విశ్రాంతి అనంతరం ఉరుముల ధ్వనుల మధ్య గుడి వద్దకు చేరుకుంటుంది. అయితే అమ్మవారి ఉత్సవ విగ్రహ సామాగ్రిని ఎవరికీ తెలియ కుండా కొందరు దాచిపెట్టడం జరుగుతుంది. అనంతరం చిన్నమ్మ ఆలయం వద్దే కొందరిని కూర్చోబెట్టి ఉరుముల ధ్వనులతో పూనకం తెప్పిస్తారు. అమ్మవారు పూనకం వచ్చిన వ్యక్తులు ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన అమ్మవారి వస్తువులను తీసుకువచ్చి ఆలయంలో అలంకరించడం విశేషం. ఈ ప్రక్రియను తిలకించడానికి రాత్రంతా భక్తాదులు ఆసక్తితో ఎదురుచూస్తూ అమ్మవారి గొప్పతనం గురించి చెప్పుకుంటారు.
పరుషకు హాజరైన భక్తాదులు చిన్నమ్మ ఆలయానికి దక్షిన వైపున వున్న శ్రీ ఆంజనేయస్వామి, అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న భవనాశినీ ఆశ్రమంలోని శివాలయాన్ని తిలకించి పూజలు నిర్వహిస్తారు. పరుష జరిగే 4రోజుల పాటు భక్తాదులు అన్ని సౌకర్యాలను కల్పించడంలో వంకరకుంట గ్రామస్తులు ముందుండి పరుషలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరుష కార్యక్రమాన్ని పూర్తీ చేయడం జరుగుతుంది. పరుష జరిగే సమయంలో చిన్నమ్మ ఆలయ ప్రాంత పరిసరాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు పెద్దపెద్ద దుకాణాలు ఏర్పాటు చేయడంతో అక్కడికొచ్చి భక్తాదులు పలు వస్తువుల కొనుగోలుతో పాటు అక్కడి వెళ్ళే పురుషులు దుకాణాల్లోని గాజులను కొనుగోలు చేసి తమ తోబుట్టువులైన అక్కచెల్లెళ్ళకు గాజులు అమ్మవారి పసుపుకుంకుమలు సమర్పించుకోవడం ఆనవాయితీ.
*
చిత్రాలు..చిన్నమ్మ ఆలయం
*చిన్నమ్మ మూలవిరాట్
*చిన్నమ్మ సమాధి

- నల్లమాడ బాబ్‌జాన్ 85000 83799