Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముని పదకమలాలను ముద్దెట్టుకున్నాడు సూర్యుడు.
ఇరువురూ అలా కాసేపు ఆడుకున్నారు. ఇంతలోనే పరుగుపరుగున వచ్చిన చెలికత్తెలు బాల రామున్ని లాక్కెళ్ళారు స్నానం చేయించడానికని.
సూరీడు చిన్నబోయాడు.
కానీ ఆతని పాదధూళి సోకి, ఆరోజు రోజంతా మరింతగా మెరిసి పోయాడు సూరీడు.
వచనం: మరొకనాడు బాలరాముడు మట్టితో ఆడుకుంటున్నాడు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఓ యక్షుడు ఆ బాలకుని అందచందాలకు దివ్య తేజస్సుకు ముగ్ధుడై అక్కడే ఆగిపోయాడు. కాసేపు ఆతని బాల్య క్రీడల్ని చూచి, అబ్బురంతో ఆనందించి, భూమిపైకి దిగి, ఇలా అన్నాడు బాల రామునితో...
యక్షుడు:
ఎవరవీవు? ఎవరవీవు? ఎటునుండిట దిగినావు?
ఎచటికేగ నెంచినావు? ఇచట విడిది చేసినావు?

చేతులెత్తి ఆకాశంలోకి పైకి చూతువేల?
విశ్వాలను నీ కౌగిట గ్రుచ్చుకొనగ జూతువేల?

చిన్ని చిన్ని చేతులతో మన్నున ఈ ఆటలేల?
నీ చేతులతో భూమిని పైకి లేప జూచేవో?

రాళ్ళూ రతనాల తోడ నొక్కరీతి నాడుదువే?
పుట్టుకతో సమదృష్టిని ఎట్టుల సాధించేవో!

పొట్టతోడ ఓపికతో ప్రాకుచు పారాడెదవే!
ప్రాకిప్రాకి సురలోకపు ద్వారాలను తెరిచేవో!

తడబడియెడు నడకలతో పడి లేచుచు తిరిగేవే!
నడక నేర్చి లోకమ్ముల నడిపించగ జూచేవో!

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087