Others

ఔచితీమూర్తి ఆంజనేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరికి ఎక్కడ ఎంత వరకు విషయాన్ని వివరించాలో తెలిసిన వివేకవంతుడు ఆంజనేయుడు. ఓసారి సీతానే్వషణలో భాగంగా వానరులు స్వయంప్రభను కలుసుకున్నారు. ఆ స్వయంప్రభతో ఆంజనేయుడు మాట్లాడిన తీరుకు ఆమె ముచ్చట పడి వానరవీరులందరికీ ఆతిథ్యమిచ్చింది. దారి వెతుకుంటున్న వానరులకు స్వయంప్రభ సముద్రతీరం చేరడానికి సాయం చేసింది. సీతమ్మను లంకలో చూసి వచ్చిన హనుమంతుడు తన తోడి వానరులకు ఆయన చేసిన విషయాలే చెప్పాడు కానీ సీతమ్మతో జరిపిన సంభాషణ చెప్పలేదు. అట్లానే సీతమ్మ వియోగదుఃఖంలో ఉన్న రామునితో మొట్టమొదట ‘‘చూశాను సీతమ్మ’’ను అని చెప్పి సంతోషించే రామునితో సీతమ్మతో జరిపిన సంభాషణనంతా చెబుతూ ఆమె పరిస్థితిని తెలియపర్చాడు. ఆ తల్లి చెప్పిన కాకాసుర వృత్తాంతాన్ని చెప్పాడు కానీ, తాను నష్టపరిచిన రావణ సైన్య విషయాన్ని రామునికి చెప్పలేదు. మాటల్లో ఔచిత్యాన్ని చూపగల నేర్పరి గనుక నే ఔచితీ మూర్తిమత్వం ఉన్న ఆంజనేయుడన్న పేరు సంపాదించుకున్నాడు.
ఇంత పరాక్రమమున్న హనుమంతుడు ఎక్కడా తన వీరత్వం గురించి చెప్పడు. ఎప్పుడూ తాను రాముని దూతనని, రామబంటునని, సుగ్రీవుని బంటునని చెప్పుకుంటాడు. ఇక్కడా హనుమంతునిలోని వినయవైదుష్యాలు తెలుస్తాయి. అహంకారం ఉంటే అది నాశనానికే దారితీస్తుంది కానీ పైకి ఎదగడానికి కాదని తాను ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, తనకు ఎంత విద్య వచ్చినా వినయంగానే ఉండాలన్నది హనుమంతుని సందేశం. ఎదుటివారిని మెచ్చుకునే గుణం అందరిలోను ఉండదు. పైగా శత్రువుగా తలిచినవారిలో మంచి గుణాలున్నా వాటిని ఎవరూ లెక్కించరు. హనుమంతుడు మాత్రం రావణులో పరదారా వ్యామోహం తప్ప మరే దుర్లక్షణాలు లేవంటాడు. ఒక్క దుర్గణాన్ని దూరం చేసుకొంటే రావణుడు ఇంద్ర పదవికి కూడా అర్హుడవుతాడు అని మెచ్చుకుంటాడు. రామ పట్ట్భాషేక సమయంలో అందరినీ సీతారాములు సత్కరిస్తున్నారు. రాముడు వారికి తోడ్పడుతున్నాడు. అందరికీ సత్కారాలు చేసేశాము అనుకొని సీతారాములు ఆసీనులయ్యారు. ఆంజనేయుడు కూడా వారితో పాటు సుఖాసనం లో కూర్చున్నాడు. ఆనంద చిత్తంతో రాముని పా దాల వంక తదేకంగా చూస్తున్నాడు. తన మనసున ఎప్పటికీ మీరిద్దరూ ఇలానే ఉండాలని కోరుకున్నాడు.
అటువంటి హనుమ కనుకనే రాముడు తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి సీతమ్మకు ఇచ్చి ఈ నిండి ఉన్న ఈ సభాప్రాంగణంలో నీకిష్టమొచ్చిన వారికి ఈ ముత్యాలహారాన్ని బహుమతిగా ఇవ్వుము అని రాముడు చెబితే వెంటనే సీతమ్మ హనుమన్నను పిలిచి తనకు ఈ ముత్యాలహారాన్ని బహూకరించింది. సభ అంతా హర్షమోదాలతోమారుమ్రోగింది. ఆంజనేయుడు కన్నీరు కారుస్తూ సీతారాముల పాదాలపై మోకరిల్లాడు. నేటి యువత హనుమంతుని నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

-ఎ.సీతారామారావు