Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాస్త్ర పారమరసె- అర్థశాస్త్ర అర్థమరసె
పరిపాలన కీలునెరిగె- ప్రభుధర్మమ్మరసె.

ఎనె్నన్నో నేర్చెనతడు- ఎంతొ జ్ఞానమందెను
అన్నిటితో కూడనతడు నేర్చుకొనుట నేర్చెను.

శారదయే అష్ట్భుజిగ మారి చదువు నేర్చెననగ
దశరథ పుత్త్రులు నల్వురు- విద్యలెల్ల నేర్చిరి.

రాచవిద్యలు
విలువిద్యను నేర్చునాడు- చూపులె తూపులు నాయెను
తనువే ధనువై పోయెను- రక్షయె లక్ష్యమ్మాయెను.

కత్తివోలె కత్తి ద్రిప్పి- అశ్వమ్ముల స్వారిజేసె
చక్రమ్ముల ద్రిప్పనేర్చె- సారథ్యమ్మరసె.

మల్లుల యుద్ధమ్మెరిగెను- భిల్లుల పోరెరిగెను
రాక్షస మాయల దెలిసెను- సురుల తీరులెరిగెను.

భూమిని, పాతాళమ్మున- నీటను గగనమ్మున
యుద్ధమ్ములు సేయునేర్పు- నెరిగె నేర్పుతోడన.

తన నీరమె తనను వీడి- తనను పిదప జేరినట్లు
రాముండను జలధిలోన చేరె విద్యలెల్ల

ఎన్ని నేర్చినను వారలు- వీడరైరి వినయమ్మును
ఎంత ఎదిగినను వారలు- ఒదిగిరి మర్యాదను.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087