Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షోడశ ప్రాయమ్మునందె- షోడశ కళలను దేలెడు
తనయులగని పరిణయమ్ము తండ్రి సేయనెంచెను.

ఆగమనం
(విశ్వామిత్రోదయం)
విశ్వానికి మిత్రుండో విశ్వానికమిత్రుండో
చుక్కవోలె తెగిపడియెను విశ్వామిత్రుండు.

సూర్యులనే వణికించును- చంద్రులనే భయపెట్టును
విశ్వాలనె పిడికిలించ గలిగినట్టి వాడతండు.

అతడు కన్నుతెరిచెనేని- అనిలనేత్రుడైన జడియు
కాలెత్తిన తోడనతడు- కాలుడైన విహ్వలుడగు.

చుక్కలతో తానమ్ముల అనునిత్యం చేయగలుగు
రిక్కలనే కుప్పవోసి యాగమ్ముల నెరపగలుగు.

అతని పేరు విన్నంతనె- వణుకును ముల్లోకమ్ములు
అతని రూపు గనినంతనె- ఆదిశేషుడైన జడ్యి.

గ్రహములతో గోళికాయ లాడగలుగు సమర్థుండు
భువనాలను కొనగోటను మీటగలుగు ఘనుండు.

ఆగ్రహమున అనుగ్రహాన ఆతనికతడే సాటి
నదుల సాగరాల గలిపి గండూషించగ ఘటికుడు.

దండమిడిన రక్షించును- ఎదిరించిన కళ్ళుతెరచి
భస్మీపటలం చేయును- ఆతండొక యముండు

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087