Others

సద్భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలంటారు. నియమనిష్ఠలతో ఆ పని మీదే ధ్యాస పెట్టి చేసే పనులే అనుకొన్న ఫలితాన్నిస్తాయి. మనోవాక్కాయములలో పవిత్రత, ఐక్యత కలిగినపుడు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయ. ఈసురోమని పనులు చేస్తే అవిఅవి కూడా నీరసమైన ఫలితాలనే ఇస్తాయ. నలువైపుల నుంచి మంచి భావనలు నాకు చేరాలి అని ప్రార్థించమని వేదం చెబుతుంది. మంచినే పలకాలి. మంచినే చేయాలి. మంచినే చెప్పాలి అని అనడంలో ఏ పని చేసినా అదినలుగురికి శుభాలను ఒనగూర్చాలని పెద్దల సంకల్పం. అందరూ బాగుండాలనీ అందులో తానూ ఉండాలని మేధావులు అంటుంటారు.
మంచిఫలితాన్ని ఇచ్చే పనులు ఎపుడూ సమాజహితంగానే అంటే సమాజానికి మేలును చేస్తాయి. ప్రపంచం ఆదరిస్తుంది, గౌరవిస్తుంది. చివరకు భగవంతుడు కూడా మెచ్చుకునేలా చేస్తాయి.మంచి పనులు చేయాలనుకొనే మనిషి అధీనంలో అరిషడ్వర్గాలు- కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇవి ఉండాల్సిన మోతాదును మించి ఉన్నట్టు అయతే వీటి ప్రభావంవలన మనిషి ఆలోచనలపై పడి ఆలోచన్లు కలుషితమవుతాయి. చెడు ఆలోచన్ల వల్ల మనస్సు పరి పరి విధాలుగా పోయి జీవితానే్న అతలాకుతలం చేస్తుంది. అపురూపమూ, అమూల్యమూ అయన మానవ జీవితంకడగండ్ల పాలవుతుంది. చెడు ఆలోచన్లు మనిషిని చెడు మార్గంలో నడిపించి, పతనాస్థితికి చేరుస్తాయ. మాట మంచి పదునైన ఆయుధం. ఈ ఆయుధాన్ని మానవ కళ్యాణానికి ఉపయోగించుకోవాలి. సదా ఎదుటివారి మన్సును మాటలతో రంజింపచేయాలి. మనిషికి మాటనే పెట్టని ఆభరణం. మాటల్లో ఆప్యాయత, అనురాగం- ఉంటేవీటికి మంచి పవిత్రత చేకూరు తుంది. సత్యమే పలుకమని వేదం చెబుతుంది. ఆ వేదమే పరుషంగా మాట్లాడవద్దనీ చెబుతుంది. సత్యం కఠినంగా ఉన్నా ప్రియంగానే చెప్పాలి. పరుషపదాలు ఎదుటివారి మనస్సు బాధపెట్టుట కంటే మంచి మాటలు మాట్లాడి ఆనందింపజేయడం శ్రేయస్కరం.
మానవ కళ్యాణకారులందరూ కూడా సమాజానికి మార్గదర్శకులు అవుతారు. ఆయుధాలు చేయలేని పనిని కేవలం మాటలు చేసిపెట్తాయ. ఈలోకంలోకి వచ్చే నాడు ఎవరూ ఏమీ తీసుకొని రారు. వెళ్లేటపుడూ ఏమీ తీసుకొని వెళ్లరు.అందుకే జీవితం క్షణభంగురం ఈ జీవితం అం టారు. కొద్దిసేపు ఉండి పోయే ఈ జగతిలో మంచిచెడులను మాత్రం మిగిల్చిపోతాం. చనిపోయనా చేసిన మేలు ఏదైనా ఉంటే వారు చిరంజీవులుగానే మిగిలిపోతారు.
రాముడు, కృష్ణుడు మనుషులుగా పుట్టిన దేవుళ్లు గా కీర్తించబడుతున్నారు. కృష్ణుడు కూడా గోపాలురతో కలసి గోవులను కాయడానికి వెళ్లేవాడట. నలు గురితో కలసి ఉండడం నలుగురి మంచి కోసం పనులు కృష్ణుడే చేసి చూపించాడు. ఒకవైపు దేవుడినని చెబుతూ రాక్షస సంహారం చేశాడు. మరోవైపు మానవత్వం తో తోటివారికి సహాయం అందించాడు.

- జి. వివేక్