Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాదపూజలను వౌనికి పాలతోడ సేయు వేళ
మణిమయవౌ మకుటమ్మే పడిపోయెను పాదాలను.

రత్నఖచితపీఠమ్మే రాలినట్లు పదములందు
భౌగోళమె భక్తికొలది పూజాసుమమైన యట్లు.

రాజరాజు శిరమట్టుల- రాజిల్లెను మునిపదములు
మునులే కద ఏలువారు నేలు వారినైనను.

ఆతని మకుటమ్ముదీసి ఆతనికె యిచ్చె వౌని
కొనినట్టుల రాజ్యమె చేకొనెనంతట రాజు.

కుశల ప్రశ్నలడిగి రేడు కుశలమ్మరసేను
ఏమిసేయగల వాడను? ఏమి నాకు సెలవనె.

‘సైన్యమ్మా? రాజ్యమ్మా? ధాన్యమ్మా? ధనమ్మా?
సెలవీయుడి నాకింకను సేతు నర్పణమ్ము’’

అడిగె కాని ఆనృపుండు అడగొందెను లోలోపల
ఏమడుగునొ? ఏ నిప్పుల? నెటుల తన్ను ద్రోయునొయని!

‘‘ఏమి చేసికొందునోయి? ఏమి చేయువాడ?
అన్ని విడిచి మునినైతిని ఆ విషయమ్మెరుగవే?

ఏమి లేదు నీకు సంతు గలిగెనంచు వింటిని
వారల జూచెడు వేడ్కన నేనిటకే తెంచితిని’’

అనగానే వౌనియటుల ఆనందమ్మంది నాడు
తనతనయుల వెనువెంటనె పిలిపించెను రేడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087