AADIVAVRAM - Others

పోటీ పరీక్షలను ఎదుర్కోవడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో పరీక్షలను శాసించవచ్చు.
మనం మనసులో ఏది మనోసిద్ధితో అనుకుంటే అది సాధించే సత్తా మన సబ్ కాన్షియస్ మైండ్‌కు ఉందని ప్రయోగ పరిశోధనలు రుజువులు చూపుతున్నాయి. విజయం అనగానే ఒక్కసారిగా మన మనసును కొంత వెనక్కి తీసుకుని వెళ్లండి. జెండా పండుగ రోజు నిర్వహించిన ఆట పోటీల్లో, తరగతిలో మంచి మార్కులు సాధించడం, ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులను అందుకోవడం ఇలాంటివెన్నో ఆనందకరమైన సంతోషాన్ని ఇచ్చే సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటే పరీక్షల వల్ల కలిగే వత్తిడిని అధిగమించవచ్చు. చిన్నప్పటి నుండి నేను ఎన్నో సాధించాను ఈ పరీక్షలలో కూడా విజయ బావుటా ఎగురవేస్తాను అని అనుకోవాలి. కచ్చితంగా సాధిస్తారు.
చదివేది అర్థం చేసుకుని చదవాలి. ఎంత చదివామన్నది కాదు. ఎంతమేరకు అర్థం చేసుకుని చదివామన్నది ముఖ్యం. పుస్తకాలు ముందేసుకుని బట్టీకొట్టి చదివేదానికన్నా చదివేది ఎంతైనా సరే అర్థం చేసుకుని చదవడం వల్లనే బాగా గుర్తు ఉంటుంది. చదివినది పర్మినెంట్ మెమరీలోకి వెళ్తుందని గుర్తించాలి. చదివేటప్పుడు చదువుతున్న విషయాన్ని ఒక్కొక్క దానికి కనెక్ట్ చేసుకుంటూ మనసులో ఆ విషయాలను ముద్రించుకోవాలి. ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ వస్తుందో ఇంటర్ లింక్ ఏర్పాటు చేసుకుంటూ చదివితే బాగా గుర్తు ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
ముఖ్యమైన పాయింట్స్: పుస్తకం చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఏవైనా ఉంటే వెంటనే ఒక నోట్ పుస్తకంలో రాసుకోవాలి. ఈ పాయింట్స్ రివిజన్ చేసుకునే సమయంలో బాగా ఉపయోగపడతాయి. జవాబులను మన సొంత వాక్యాలలోకి అర్థం చేసుకుంటూ చదివితే చాలా సులభంగా పరీక్ష సమయంలో గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. జవాబులు చదివిన తర్వాత ఒక్కసారి అద్దం ముందర నిల్చుని తనకు తానుగా మననం చేసుకోవాలి. వీలైతే ఒక్కసారి రాసినట్లైతే బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది.
సందేహాల నివృత్తి: తరగతి గదిలో సార్ పాఠం చెప్పినంత సేపు అర్థం అయినట్లుగానే ఉంటుంది. పుస్తకం తీసి చదవడానికి కూర్చున్నప్పుడే లెక్కలేనన్ని డౌట్స్ వస్తాయి. వీలైనంత మేరకు మీకు మీరుగా ప్రయత్నం చేయండి. అప్పటికీ తీరకపోతే ఆ డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని టీచర్ ద్వారా సందేహ నివృత్తి చేసుకోవాలి. ఇక కొంతమంది విద్యార్థులు సందేహాలను అడగడానికి భయపడి అడగకపోవడం వల్ల ఆ డౌట్స్ అలాగే ఉండి నష్టపోతారు.
ఆరోగ్యకరమైన నిద్ర, పోషకాహారం: పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి లోనై ఆహారం విషయంలో నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోకపోతే పరీక్షల సమయంలో నీరసం ఏర్పడుతుంది. శారీరక శక్తి తక్కువవుతుంది. నిద్రకు కచ్చితంగా 6 గంటలపాటు సమయాన్ని కేటాయించాలి. సరైన నిద్ర తీసుకొన్నప్పుడే బ్రెయిన్ ఆక్టివ్‌గా పని చేయడానికి అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు సహాయకారిగా ఉండాలి: పిల్లలకు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలి. పిల్లలు చదవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పుడు, ఇతర పనులలో వారికి సహాయకారిగా ఉండాలి. పిల్లలు చదువుకునే గదిని శుభ్రం ఉంచడం చేయాలి. ఇతర పనులపట్ల వారి ఆలోచనలు మరలకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొంటే ఏకాగ్రతతో చదివే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు పిల్లలకు సమయాన్ని కేటాయించాలి. పరీక్షల సమయంలో పిల్లలతో గడపడానికి, వారితో మాట్లాడడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. పిల్లల్లో పరీక్షల వల్ల కలిగే భయాందోళనలను వారి మానిసక స్థితిని గమనిస్తూ తగిన విధంగా గైడ్ చేస్తూ ఉండాలి. పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నావంటూ పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండాలి. వారిలో మానసిక ధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది.

-డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి