Others

వలస పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంటి?
ఇంకా అర్థం కాలేదా
బతుకు పాటలోని పల్లవి
రోడ్డుమీద పారేసిన
పాచిపోయన రొట్టెముక్కలా ఉన్నది

రేపు ఉదయంచాల్సిన సూర్యుడు
ఈ సాయంత్రం వేళ నడిరోడ్డులో
దుమ్మెత్తి పోసుకుంటున్నాడేంటి!
విరగపూసిన మల్లెపువ్వుపై త్రాచుపాము;

వలస తీరానికి చేరిన వాయుగుండంలో
చరణాలు గమ్యాలు మార్చుకున్నాయ
ముగింపు లేని వాక్యాల్లా
శబ్దరహితంగా వాడిపోయన జీవితాలు

ఒక్కసారి ముఖంపై చేతిని తిప్పితే
కుండపోత వర్షం
కాల్లకిందికి రాలుతుంది
రాలిన బిందువుల్లో కష్టాన్ని వెతికే కళ్ళు
ప్రతిబింబాలై కరిగిపోతాయ

వలస పాటను నేను తాకలేను
భావరహిత పాటను చూడలేను
వెలవెలబోతున్న రేపటి కిరణాల్ని
రోడ్డుపై పారబోసుకున్న దేశాన్ని ఏమనాలి?

దేశానికి చూపు మందగించింది
నేను కంట్లో ‘ఐ డ్రాప్స్’ పోస్తాను
బొట్టు బొట్టులో మానవత్వాన్ని కలుపుతాను
అవసరమైతే అగ్గిని కూడా పోస్తాను
ఏపుగా కాసిన అవినీతి కాలిపోతుంది

సూర్యుడు ఇంట్లోనో,
రోడ్డులోనో ఉంటే ఎలా?
అందుకే నేను
ఆకాశంలోకి విసిరేశాను
అక్షర నక్షత్రాల నడుమ
సూర్యుడు జ్ఞానాన్ని వెలిగిస్తూ...

- అఖిలాశ, 7259511956