Others

ఊహల పల్లవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసంత సమీరానివై
వలపు పల్లవమును స్పృశిస్తూ
మోహన వాహినిలో
సరాగాల రాగకృతులను
సవరిస్తున్న వేళ
నేనొక విరహ వీక్షణనై
గోపికా తరళీక్షణనై
ప్రణయ చరణాల సుధాశృతి
గ్రోలుచున్నాను
కళాతృష్ణ తెలియని
నా గళ ద్వారం చెంత
నీ ప్రేమ గీతాల రుచులను
నింపుకొనుచున్నాను
ఈ వౌన వెదురుమీద
విపంచి సవ్వడులు వినిపించినట్టు
నా హృదయ వేదనమీద
భావ గీతికా తుంపరులు
వెదజల్లినట్లు
ఒక అందమైన భావన
కాని ఇదంతా స్వప్నమేమోనని
శర్వరీ తమో వీధులు
ప్రభాత విభావరిని తాకుతుండగా
ఉచ్ఛ్వాస నిశ్వాసలా
ఆలాపన మెల్లగా తట్టి
నన్ను నిద్దురలేపింది
అయనా,
నా ఊహల పల్లవి
నీవే సుమా!

- సముద్రాల శ్రీదేవి, 9949837743