Others

తీరిన కోర్కె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకానొక కాలంలో శిలాదమహర్షి అనే ముని పుంగవుడు ఉండేవాడు. అతడు తనకు సంతానం లేదని ఎంతో బాధపడుతుండేవాడు. సృష్టిస్థితిలయలకు కారణభూతుడు, ఆధారభూతుడైన కరుణాంబోధి అపార కృపావత్సలుడైన ఆ పరమేశ్వరుడు తప్ప తనను బాధనుంచి విముక్తిచేసేవారు ఎవరూ లేరని నిశ్చయించుకొన్నాడు శిలాద మహర్షి. అందుకే ఆ పరమ శివుని కోసం తపస్సు ఆరంభించాడు. ఎన్నోవేల సంవత్సరాలు సంతానార్థియై పరమేశ్వరుని పట్టు వదలక ధ్యానించాడు.
కొన్నాళ్లకు శివుడు శిలాదుడిని అనుగ్రహించ దలిచాడు. శిలాద మహర్షి ముందు నిల్చుని ‘‘ఏమి నీకోరిక శిలాద!’’ అని ప్రశ్నించాడు. నిన్ను పూజించేవారు నిన్ను మెప్పించే శక్తియుతులైన వారిని నాకు కుమారులుగా అనుగ్రహించు పరమేశ్వరా అని కోరుకున్నాడు. శివుడు ‘నీకోరిక ఫలించుగాక’ అని అభయం ఇచ్చాడు.
కొన్నాళ్లకు కాలం కరుణించింది. శివుని వరంతో శిలాదుడు తండ్రి అయ్యాడు. పర్వతుడు, నందుడు అనే కుమారులను శిలాద మహర్షి పొందాడు. ఎంతో ఆనందించాడు. వారు దినదినాభివృద్ధి చెందుతున్నప్పుడే శివభక్తిని వారిలో శిలాదుడు నాటించాడు. వారు యుక్తవయస్సు వచ్చేసరికే శివభక్తిలో తన్మయత్వం చెందేవారు.
ఆ సమయంలోనే నందుడికి ఎల్లప్పుడు శివుని ఎదురుగా ఉండాలన్న అభిలాష కలిగింది. తన తండ్రికి తన కోరిక తెలిపాడు. తండ్రి అనుమతితో శివుని గూర్చి తపస్సు ఆరంభించి ఏన్నో వేల యేండ్లు ఆ తపస్సులోనే మునిగిపోయాడు. ఆ నందుని కఠిన తపస్సుకు అచంచల భక్తివిశ్వాసాలకు మెచ్చుకున్న పార్వతీ ప్రియుడు నందుని ఎదుటకు వచ్చి కోరిక ఏమిటో తెలుపమని అడిగాడు.
నందుడు ఎంతో సంతోషించి స్వామీ సదా నీ పాదద్వయాన్ని చూస్తుండే టట్లువరం ఇవ్వమని అడిగాడు. పరమేశ్వరుడు ఆనందించి ‘‘ఓ నందా! నీవే నా వాహనమవుదువుగాక! అంతేగాక నీవు చేసిన ఈ ఘోర తపస్సును పలుకాలాలు జనం అంతా గుర్తుపెట్టుకొనేట్లుగా ఈ తపోభూమిలోనే నేను ఆర్చామూర్తినై వెలుస్తాను. నా భక్తుల కోరికలు తీర్చడానికి నేను ఇక్కడే కొలువై ఉంటాను ’’ అని శివుడు అనుగ్రహించాడు. అది విన్న నంది మహోత్సాహంతో తన తండ్రికి ఈ విషయాన్ని తెలియచేశాడు. అట్లా ఏర్పడిన స్థలమే నేడు మహానందిక్షేత్రంగా భాసిల్లుతోంది. నేడు కూడా మహానంది క్షేత్రంలో నందీశ్వరుణ్ణి వివిధోపచారాలతోశివభక్తులు సేవిస్తారు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ ఏకాదశి మొదలుకొని ఫాల్గుణ శుద్ధ విదయ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. కార్తికమాసంలోను మాఘమాసంలోను నందీశ్వరునికి విశేష పూజలు నిర్వహిస్తారు.్లకకల్యాణార్థం శివఫార్వతుల కల్యాణోత్సవాలను జరుపుతారు. ఆ తరువాత బ్రహ్మనందీశ్వర స్వామి గ్రామోత్సవము, అశ్వ, సింహ వాహనసేవలు మహారథోత్సవము అంటూ జరిగే వివిధ కార్యక్రమాలను చూచి తీరవలసిందే కాని వర్ణించడానికి మాటలు చాలవు.

- బ్రహ్మశ్రీ కురువాడ మురళీధర్ శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ శంకరమఠం