Others

జుట్టు రాలుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసుతో సంబంధం లేకుండా జుట్టురాలడం సాధారణమైపోయింది. వెంట్రుకలు రాలే ప్రక్రియను తగ్గించుకోవడానికి తలపై చర్మం, జుట్టుపై ప్రత్యేక శ్రద్ధను, తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మొదటగా తినే ఆహారపదార్థాలపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి. తినే ఆహారంలో శరీరానికి కావాలసిన విటమిన్ ‘ఎ’, సంక్లిష్ట విటమిన్ ‘బి, సి, ఇ’లతో పాటుగా తగిన మొత్తంలో ప్రొటీన్, కాల్షియం, జింక్, ఐరన్ మూలకాలు ఉన్నాయా? అని చూసుకోవాలి. పోషకాహార నిపుణులను కలిసి, జుట్టు రాలకుండా ఉండటానికి, ఆరోగ్యం మెరుగుపడటానికి కావలసిన పోషకాలు ఉండేలా ఆహార ప్రణాళికను తయారుచేసుకోవాలి. సాధారణంగా అల్పాహారంలో పాలు, గుడ్లతో పాటు మధ్యాహ్న భోజనంలో లీన్ మీట్, గ్రీన్ సలాడ్ వంటివి తీసుకోవాలి. వీటిద్వారా కావలసిన పోషకాలు అందుతాయి. వీటితోపాటుగా మధ్యమధ్యలో పండ్లు, నట్స్‌లను స్నాక్స్‌గా తీసుకోవాలి. రాత్రి భోజనం మొత్తంలో లీన్ ప్రొటీన్లతో పాటుగా కూరగాయలను తినాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్కువ నీటిని తాగాలి.
* కెఫిన్, ఆల్కహాల్, నికోటిన్ అనే మూడు రకాల అలవాట్లు జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కెఫిన్, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటివల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతామని కొంతమంది అభిప్రాయం. కానీ వీటివల్ల శరీరంలో తగ్గే సమస్యల కంటే పెరిగే సమస్యలే ఎక్కువ. వీటివల్ల జుట్టు రాలే ప్రక్రియ అధికం అవుతుందట.. కాబట్టి ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
* జుట్టు రాలడానికి మరో ముఖ్య కారణం.. ఒత్తిడి. జుట్టు రాలడం అధికంగా ఉంటే మాత్రం ఒత్తిడిని అధిగమించి ప్రశాంతతను అందించే పద్ధతులను అనుసరించాలి. ధ్యానాన్ని అనుసరించడం ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటూ కూడా ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
* రక్తప్రసరణ ఆరోగ్యకర స్థాయిలో ఉంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. రోజూ కేవలం 30 నిముషాల వ్యాయామాలు ఆరోగ్యంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒకవేళ వైద్యపరంగా భౌతిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉంటే వెంటనే యోగా లేదా కొద్దిదూరం నడవటం వంటి వాటిని అనుసరించండి.
* శరీరంలో అంతర్గతంగా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించిన తరువాత బహిర్గతంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కఠినమైన షాంపూ, కండిషనర్‌లను వాడకూడదు.
* ఎక్కువ సమయం కాలుష్య వాతావరణంలో ఉండకూడదు. తలపై చేరిన దుమ్ము, ధూళిలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
* జుట్టు సంరక్షణ ఉత్పత్తులు వాడేటప్పుడు రసాయనాలు లేనివాటిని ఎంచుకోవాలి. హెయిర్ స్ప్రేల వంటి వాటిని ఉపయోగించకపోవడమే మేలు.
* తలకు వేసుకునే రంగులకు బదులుగా వెంట్రుకలకు సహజ పోషకాలను అందించే సహజ నూనెలను వాడటం మంచిది. శుద్ధమైన, దంచిన గోరింటాకులను వాడటం వల్ల జుట్టుకు సహజ ఎరుపుదనంతో పాటు సహజ కండిషనర్‌లా కూడా పనిచేస్తుంది.
* హార్మోన్ల అసమతుల్యత కలిగి ఉన్నవారు తప్పకుండా వైద్యుని సలహా తీసుకోవాలి. ఇలా జుట్టు రాలడాన్ని నియంత్రించుకోవచ్చు.