Others

ఖర్జూరంతో లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రక్తకణాలకు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మూలకాలను అందించడంలో ఖర్జూరం సహాయపడుతుంది. మెగ్నీషియం రక్తంలోని చక్కెరలను సాధారణ స్థాయిలో ఉంచడమే కాకుండా, హృదయ స్పందన రేటును కూడా సాధారణ రేటులో కొనసాగేలా చేస్తుంది. వీటితో పాటు దంతాలు, ఎముకల అభివృద్ధికి ఈ మూలకం తప్పనిసరి.
* శరీరానికి తప్పనిసరిగా అవసరమయ్యే, రక్తప్రసరణను ఆరోగ్యకర స్థాయిలో ఉంచడానికి పొటాషియం తప్పనిసరి. ఇలా పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కండరాల విధికి కూడా సహాయపడుతుంది.
* శరీరంలో జీవక్రియ సజావుగా జరగడానికి ఐరన్ తప్పనిసరి. కణాలన్నింటికీ ఆక్సిజన్‌ను అందించే రక్తంలోని ఐరన్, ఎంజైముల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది ఐరన్. ఖర్జూరంలో ఐరన్ స్థాయిలు అధికంగా ఉండడం వల్ల తల్లీబిడ్డలు అనీమియాకు గురవకుండా ఉంటారు.
* ఖర్జూరంలో ఉండే ప్రొటీన్‌లు అమైనో ఆసిడ్‌లను కలిగి ఉంటాయి. ఇవి పిండాభివృద్ధికి తోడ్పడతాయి. శిశువు పెరుగుదలకు అధిక మొత్తంలో ప్రొటీన్లు అవసరమవుతాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తి మెరుగుపరిచే ఫైబర్‌ను అధికంగా కలిగి ఉండడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే మలబద్ధక సమస్యలను నివారించుకోవచ్చు.
* ఖర్జూరంలో ఉండే ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. తక్కువ కొవ్వు పదార్థాలతో పాటుగా కరిగే ఫైబర్‌లను కలిగివుంటాయి డేట్స్. పోషకాలను అధికంగా కలిగే ఉండే వీటిని గర్భిణులు తినడం వల్ల తల్లికి, కడుపులోని బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.