Others

కంటి కింద బ్యాగులను తొలగిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్యులైటిస్, ఊబకాయం వంటి వాటివల్ల మన శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోతుంటాయి. ఇవేకాదు కంటి కింద బ్యాగుల వలె వచ్చే వాటికి కూడా కొవ్వు పదార్థాలే కారణం. దీన్ని వైద్యపరంగా క్యాంథస్ లేదా క్షాంతెలేస్మా అంటారు. కంటి కింది ప్రాంతంలో చెడు లేదా తక్కువ సాంద్రత గల కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. మధుమేహం, రక్తంలో అధిక స్థాయి చక్కెరలు, కాలేయ వ్యాధులు, ఇతరేతర రుగ్మతలు వంశపారంపర్యంగా సంక్రమించడం వల్ల ఇవి కలుగుతాయి. శరీరంలో అధిక కొవ్వు పదార్థాలు కలిగి ఉన్నచో, ఇలాంటివి కలిగే అవకాశం ఉంది. అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు కంటి కింద, పైన పేరుకుపోవడం వల్ల ఇవి కలుగుతాయి. దీనివల్ల రాను రాను చూపు మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చికిత్సలు కూడా సహాయపడతాయి. కొన్ని రకాల ఔషధాలను వాడటం ద్వారా క్షాంతెలేస్మాను తగ్గించుకోవచ్చు.
* ఉల్లిపాయ రసాన్ని తీసి దీనికి కొద్దిగా ఉప్పు కలపాలి. దీన్ని కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో పూయాలి. మరుసటిరోజు చల్లటి నీటితో కడిగేయాలి. ఉల్లిపాయలో ఉండే సమ్మేళనాలు కొవ్వు పదార్థాలు పేరుకుపోవడాన్ని నిలిపేస్తాయి. ఈ రసం పొరపాటున కూడా కంటికి దగ్గరగా పడకుండా అంటే కనురెప్పలకు అంటకుండా చూసుకోవాలి. ఇది చేసే ముందుగా మోచేతికి రాసుకోవాలి. ఎలాంటి అలర్జీలు రాకుంటే ప్రభావిత ప్రాంతాల్లో పూయవచ్చు.
* వెల్లుల్లిని దంచి పేస్ట్‌లా చేసి ప్రభావిత ప్రాంతాల్లో పూయాలి. అలా అరగంట పాటు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. చర్మం సున్నితంగా ఉంటే ఎక్కువ సమయం పాటు ఈ పేస్ట్‌ను చర్మంపై ఉంచకూడదు. వెల్లుల్లిలో ఉండే ఎంజైము కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది.
* కాటన్ బాల్‌ను ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కాసేపు ఉంచాలి. తరువాత దీనితో ప్రభావిత ప్రాంతాల్లో పూయాలి. తీవ్రమైన ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ మచ్చలను తొలగిస్తుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించడానికి గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగవచ్చు.
* ఆముదంలో ఉండే 3రిసినో ఎలిక్ ఆసిడ్2 పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది. కాటన్‌ను ఆముదంలో కాసేపు ఉంచి ప్రభావిత ప్రాంతాల్లో పూయాలి. మంచి ఫలితాలను పొందడానికి రోజూ ఈ పద్ధతిని అనుసరించాలి.
* ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. చెడు కొవ్వు పదార్థాలు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను ఈ నీరు తొలగిస్తుంది. ఇలా చిన్న చిన్న చిట్కాలతో కంటి కింద ఏర్పడిన బ్యాగులను తొలగించుకోవచ్చు.
*