Others

బంతి భోజనాలే బాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్పారు. ఆ మాట అక్షరాలా పచ్చి నిజం. మనిషికిగానీ, జీవికిగానీ ఆహారం లేనిదే మనుగడ సాగదు. అలాంటి ఆహారాన్ని భగవత్ స్వరూపంగా చూడాలి. అన్నం తినేముందు కళ్ళకు అద్దుకొని తింటాము. అంతటి పవిత్రత ఉంది మనం తినే భోజనానికి. పేదవారు పచ్చళ్ళు, కూరగాయలతో భోంచేస్తారు. ధనవంతులయితే పంచభక్ష్య పరమాన్నాలు తింటారు. ఏ గతీ లేనివాడు ఎవ్వడు ఏది పెట్టినా దానే్న పరమాన్నంగా కడుపునింపుకుంటాడు. ఎవరు ఎలా తిన్నా, ఏది తిన్నా కూడా వారి వారి కడుపు నింపుకోవడం కోసమే. ఆకలితో వున్నవారికి మన దగ్గరున్నటువంటి పదార్థాన్ని పెడితే చాలు.. దానే్న పరబ్రహ్మ స్వరూపంగా, ఆ పరమాత్మునికి పెట్టిన నైవేద్యంగా భావించి కడుపునింపుకుంటారు. అలాంటి భోజనాన్ని ఇపుడు చాలామంది చాలారకాలుగా వ్యర్థం చేస్తున్నారు.
ఒకప్పుడు ఒక ఇంట్లో ఏదైనా కార్యం జరిగినట్లయితే ఆ భోజనాలు ఎంతో పద్ధతిగా ఉండేవి. వచ్చిన అతథులందరికీ ఒకే దగ్గర వరుసక్రమంలో నేలమీద దుప్పట్లు పరిచి భోజనాలు వడ్డించేవారు. ఎవరు ఎంత కావాలో అంతే తినేవారు. అందువల్ల వండినటువంటి భోజన పదార్థాలు వ్యర్థమయ్యేవి కావు. అలా భోజనం చేయడం ఎంతో ఆనందం, సంతోషంగా ఉండేది. మారుతున్న కాలం దృష్ట్యా కుర్చీలపై కూర్చుని, టేబుళ్ళపై విస్తర్లు పెట్టుకునే ఆచారం వచ్చింది. ఆ తర్వాత బఫే పద్ధతి (నిల్చుని తినే పద్ధతి) వచ్చింది. నిల్చుని తినే పద్ధతివల్ల భోజన పదార్థాలు ఎక్కువగా వ్యర్థమవుతున్నాయి. వ్యర్థం మాట అటుంచితే ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయి. ప్రతి ఒక్కరూ అన్నం తినేముందు కాళ్ళుచేతులు శుభ్రంగా కడుక్కొని, క్రిందనే కూర్చొని తినాలి. తినడానికి తిండిలేనివారు కొందరైతే, తినలేక పారవేసేవారు మరికొందరు. స్వచ్ఛంద సంస్థలు కొన్ని శుభకార్యాల్లో, ఫంక్షన్ హాల్స్‌లో, హోటల్స్‌లో మిగిలినటువంటి భోజన పదార్థాలను తీసుకెళ్ళి అన్నార్తులకు అందిస్తున్నారు. ఇంతటి గొప్ప కార్యం ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించినట్లే.

-శ్రీనివాస్ పర్వతాల