Others

ఆదిదంపతులు కొలువైన మాంగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపరమేశ్వరులు ఆది దంపతులు. తల్లిదండ్రులు. అమ్మా అని పిలిచినా, తండ్రీ అని పిలిచినా వెనువెంటనే వారిద్దరూ వచ్చి భక్తుని కడగండ్లను రూపుమాపుతారు. కరుణామూర్తులైన పార్వతీపరమేశ్వరులు చైన్నై నగరానికి నైరుతిదిశలో ఉన్న మాంగాడు క్షేత్రంలో కొలువైయనారు. ఇక్కడి అమ్మ వారిని కామాక్షిగా కీర్తిస్తారు.
మాంగాడు అంటే మామిడితోట అని అర్థం. ఇపుడు మామిడి తోటలు అంతగా కనిపించకపోయినా చల్లని వాతావరణం విశాలమైన ఆలయ ప్రాంగణం భక్తులను ఆకర్షిస్తుంది. కోవెలలోకి వెళ్లగానే విఘ్ననాశకుడు వినాయకుడు కొలువై భక్తులకు అమ్మవారి అనుగ్రహం కలిగేట్టుగా ఆభయం ఇస్తున్నట్టు దర్శనం ఇస్తాడు. అమ్మవారి గర్భగుడికి వెనుక భాగంలో తపస్సు చేస్తున్న భంగిమలో పార్వతీదేవి విగ్రహం మనోహరంగా కనిపిస్తుంది.
ఒకానొక కాలంలో హిమవంతుని కుమార్తెగా అపర్ణయై తపస్సు చేసి పరమేశ్వరుని తన పతిగా పొందిన పార్వతీ దేవి ఇక్కడ కామాక్షిగా కొలువైనా ఒంటికాలుపై తపస్సు చేసింది. తనకు భర్తగా పరమేశ్వరుడే రావాలని కోరుకుంది.
న ప్రేమను అంగీకరించే మనస్సు పరమేశ్వరునికి రావాలని పంచాగ్నుల మధ్య నిలబడి పార్వతి అత్యంత కఠోరమైన తపస్సు చేసింది. వీటిని నేటికి గుర్తించే విధంగా ఈ కామాక్షి అమ్మవారి ఆలయంలోని అమ్మవారి మూర్తి కుడికాలు మడిచి ఎడమ కాలుకు ఆనించి ఎడమచేయి హృదయ స్థానానికి చేర్చి కుడిచేతిని తలపై పెట్టుకున్న తీరులో అక్షమాలను ధరించి దీర్ఘతపస్సు కొనసాగిస్తున్న భంగిమ భక్తులను మైమరిపిస్తుంది. ఈ అమ్మవారు చేస్తున్న ఈ తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు ఏకామ్రేశ్వరుని రూపంలో చెన్నైకి నైరుతిదిశలో ఏకామ్రేశ్వరాలయంలో కొలువై వుండి అమ్మ తపస్సును ఫలవంతం చేయటానికి అమ్మవారిని పాణిగ్రహణం చేసి తన సరసన చేర్చుకున్నాడు. మాంగాడులోని కామాక్షి అమ్మవారు ఒంటరిగా ఉండగా ఏకామ్రేశ్వరుని ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు.
భక్తులు వారి వారి కోరిక ప్రకారం నాలుగు దీపాలు, ఆరుదీపాలు , రెండు దీపాలలెక్కన ప్రమిదలల్లో నెయ్యి వత్తులు వేసి అమ్మవారి ఎదుట వెలిగిస్తారు. ఇలా దీపాలను వెలిగించి ఏకోరిక కోరినా పరమేశ్వరునికి దీపదానం ప్రియం కనుక అమ్మవారు దీపాలు వెలిగించిన వారి కోరికలు ఈడేరుస్తుందని భక్తులు భావిస్తుంటారు.
అంతేకాక ఇక్కడ సంతానం కోరి ఈ కామాక్షమ్మవారిని వేడుకుని ఊయలలలోని దోగాడే కృష్ణుడిని కోవెలలో చెట్టుకుగానీ ఇక్కడ అమర్చి ఉన్న ఇనుప ఊచలకు గాని కట్టితే వారు తప్పక సంతానవంతులు అవుతారని భక్తుల విశ్వాసం. అలానే పెళ్లి కావాల్సిన కన్యలందరూ ఈ గుడిలో ఊయలలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను గుడి ప్రాంగణంలో కట్టితే వారికి తప్పక అమ్మ అనుగ్రహంతో కోరుకున్న వరుడితో వివాహాలు జరుగుతాయని నమ్ముతారు. ఈ గుడిలో ఏ ఈతిబాధలున్నా, ఉద్యోగ విషయంలో అధికారభయం, పదోన్నతి ఇలాంటి కారణాలున్నా సరే ఈ అమ్మవారికి పాల పాయసం చేసి పంచుతానని మొక్కుకుని ఐదువారాలు అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కె తప్పకుండా తీరుతుందని నమ్మే భక్తులు కొల్లలుగా ఈ గుడిలో పాలను పంచుతుంటారు. పాలను మరగకాచి అందులో పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌లు, కుంకుమపూవు మొదలైన సుగంధ ద్రవ్యాలను చేర్చి మరింతగా కాచి చిక్కని పాలను అమ్మవారికి ముందుగా సమర్పించాలి. ఇలా సమర్పించిన పాలను ఇక్కడి పూజారి అమ్మకు నివేదించి వాటిని తిరిగి అమ్మప్రసాదంగా పాలను ఇచ్చినవారికి ఇస్తారు. ఆ పాలను కోవెలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొన్న భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పాలను ఇచ్చిన వారికి తీసుకొన్నవారికి కూడా అమ్మ అనుగ్రహం దొరుకుతుంది. వారి కోరికలు తప్పక తీరుతాయని ఆ పాలను మహాప్రసాదంగా సభక్తి పూర్వకంగా తీసుకుని సేవిస్తుంటారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు