Others

కాల కర్మ సంయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలము అనంతము.. కర్మ అనాది. ఈ రెండు సమాంతరంగా నడుస్తుంటాయి. ఈ కాలము నాణెమునకు వలె రెండు పార్శ్వములుంటాయి. ఒకవైపు కాలమునకు భూత, భవిష్యద్వర్తమానములుంటాయి (సమూర్తము). ఇంకొకవైపు కాలమునకు ఈ మూడు కాని కాలములో వుంటుంది (అమూర్తము). ఋగ్వేద కాల సూక్తములో ఈ విషయము తెలిపారు. అది మనసుకు, బుద్ధికి గ్రాహ్యము కాదు. మరి ఈ కాలాన్ని మింగినవాడు కాలాంతకుడు. కాల, కర్మలు అవిభక్తంగానే వుంటూ విభక్తంగా గోచరిస్తాయి.
కర్మ విషయానికి వస్తే, ఆగామి, సంచిత, ప్రారబ్ధాలు వుంటాయి. అనంతమైన ఈ కాలప్రవాహంలో ఎన్నో జీవరాశులు తమ కర్మ శేషంతో జన్మ పరంపరలో పుట్టుతూ, చస్తూ జీవనయానం చేస్తాయి. ‘‘త్రిగుణాలతో మమేకమై, కోరికల పరంపరతో కొట్టుమిట్టాడుతాడు. ఇదే జన్మ పరంపరకు హేతుభూతవౌతుంది. గీతలో భగవానుడు సెలవిచ్చినట్టు, బ్రహ్మలోక పర్యంతము కాలచక్రంలో వస్తాయి. బుద్ధికి పరమైన బుద్ధి (అనగా పరమాత్మ)ని, అంతర్ముఖ సాధన చేస్తే అనగా అతీంద్రియబుద్ధి (సూపర్ కాన్సియస్ లెవల్స్)తో జీవుడు అనుసంధానము చేస్తే తాను ఎత్తిన జన్మలు, ఎత్తబోయే జన్మలు అవగతవౌతాయి. గీతలో ఈ విషయం చెప్పారు.
‘‘ఏవం బుధ్ధేః పరం బుధ్వాసః స్త్భ్యాత్మన మాత్మనా’’ -
యోగ వాశిష్ట్యములో, వశిష్ఠులవారు శ్రీరామచంద్రునకు ఈ అతీంద్రియ బుద్ధి గురించి శ్రీమాత సరస్వతీదేవి లీలకు ఉపదేశము చేసినట్టు విపులంగా చెప్పారు. వాగ్దేవి చెప్పినట్టు, ఈ అతీంద్రియ స్థితిలో నిలబడితే జీవుడు ఎత్తే జన్మలు, మరణాలు, కలలలాగా అగుపిస్తాయి. విమానంలో ఆకాశము ఎత్తులో విహరిస్తుంటే ఇళ్ళన్నీ బహు చిన్నవిగా అగుపిస్తాయి.
మరి ఎత్తులో స్పేస్ క్రాఫ్ట్ వెళుతుంటే భూమండలమే చిన్నదిగా కనిపిస్తుంది. ఈలాగున బుద్ధి గుహలో శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యము చెందితే అంతర్ముఖంలో బాహ్య ప్రకృతిలో జరిగే సంఘటనలు బహు కొద్దికాలంగా అగుపిస్తాయి. మన హృదయాకాశ పరిమాణం మనకు పైన కనిపించే భూతలాకాశమంత వుంటుంది.
ఇలా అంతరంగ, అంతర్ముఖ ప్రయాణము బాగా సాధన చేస్తే ధ్యేయము, ధ్యానము, ధ్వానము చేయువారు- ఈ మూడు ఒకటైపోతాయి. ఇదే త్రిపుటీ దర్శనము. ఈ సమాధిలో సవికల్ప, సహజ సమాధిలో కాల, కర్మ సంయోగము కలుగుతుంది. ఈ సంయోగము కలిగిన వెంటనే, అతీంద్రియ శక్తి (కాస్మిక్ ఎనర్జీ) ప్రవాహము జీవుని శిరస్సులో ప్రవేశిస్తుంది. ఈ మహాశక్తి జీవనశక్తితో (అనగా జీవుని కుండలినీశక్తితో) అతివేగంగా జత అవుతుంది. ఎలాగైతే నది అతివేగంగా సముద్రంలో కలుస్తుందో ఆ లాగున కుండలినీ అతివేగంగా ఊర్థ్వముఖ ప్రయాణం చేస్తుంది. కాంతివేగము 1,86,000 మైల్స్/సెకండ్ కుండలినీ వేగము దీనికి రెట్టింపు అనగా 3,72,000 మైల్స్/సెకన్. రామకృష్ణ పరమహంస ఈ వేగాన్ని ఇలా చెబుతారు. చిన్న మడుగులో పెద్ద గజరాజు దిగితే మడుగు ఛిన్నాభిన్నమైనట్టు, ఈ శరీరము (ఉపాధి) ఆ మహాశక్తిని భరించలేదంటాడు. ఎంతోమంది హిమాలయ యోగులు కాలాన్ని స్తంభింపజేసి ఎన్నో వందల సంవత్సరాలు జీవించినట్టు తెలుస్తుంది.
ఆత్మసాక్షాత్కారము జ్ఞానికి అయిన వెంటనే ఈ శరీరము ఎపుడు వదులుదామనే స్థితిలో వుంటాడు. బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పినట్టు ఆరబ్ధ కర్మలు ఫలితాలు ఇవ్వబోయేవి జ్ఞాని స్థూల శరీరము పడిపోయేంతవరకు అనుభవిస్తాడు. అనారబ్ధకర్మలు జ్ఞానంతో భస్మీపటలవౌతాయి (జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం-గీత). శ్రీరామకృష్ణ పరమహంస కంఠవ్రణము, శ్రీరమణులు లింబ్ వ్రణముతో జీవిత చరమ దశలో భయంకరమైన శరీర బాధలు అనుభవించారు. శ్రీరమణులను భక్తులు శరీర బాధ ఎక్కువగా వుందా అంటే ఔను, ఈ శరీరమునకు బాధ వుంది అన్నారట. శరీరము నేను కాదను పూర్ణ ప్రజ్ఞతో శివైక్యము చెందాడు. రామకృష్ణులు త్రోట్ కాన్సర్‌తో బాధపడుతుంటే, వివేకానందునికి ఒక క్షణం చిత్తభ్రమ కలిగితే వెంటనే రామకృష్ణులవారు నరేన్ త్రేతాయుగంలో రాముణ్ణి, ద్వాపరంలో కృష్ణుని నేనే అన్నారట. భారత భూమి ఇటువంటి మహనీయులను చూసి పులకరించింది.

- కె. రఘునాథ్ 9912190466