Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పృథ్వి నెల్ల మీ చేతులనుంచెద గ్రహించుడి!
నా రాముండొక పిల్లడు వాని నొగ్గివేయుడి!

పరశురాముడను కొంటిరొ? పసికూనయె వీడు!
ఎటుల ఘోర రక్కసులను ఎదిరించగలడు?

ఒక చెక్కిలి మీట పాలు- ఒక చెక్కిట నీరు
నిన్న మొన్న పాలు మరచి నట్టి బుడత వీడు.

లేక లేక కలిగె వీడు- నా కన్నుల తార!
వానినంపి నేనుందునె! విడుతును ప్రాణాల!’’

అనగానే కౌశికుండు- నవ్వె విరగబడుచును
ఆ నవ్వుల ప్రతిధ్వనులు నిండెను సభ నిండను.

‘‘పసి కూనలు నీ వారలొ? నీవొ? తెలియదోరుూ!
పసి హృదయం నీదెనోయి! పులికూనలు వీరోరుూ!

రాముండన ఎరుగుదువో? ఎవరని ఎంచితివో?
ఆ ముఖమున ద్యోతకవౌ కాంతుల కనలేవో?

ఆ కంటిని నే కంటిని కోటి కోట్ల తారకలను
ఆ ముఖమ్ము ఆ ముఖమ్ము విశ్వసౌరభాలకు.

విశ్వామిత్రుడను నేను- విశ్వంభరుడితడు
అణువువోలె నగుపించెడి- అనంతుండు వీడు.

ఐన నేడు పరమాత్ముడె మానవుడై వెలసినాడు
ఎంతటి వాడైన నేమి? గురవు లేక గ్రుడ్డివాడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087