Others

శోభన్.. నేనూ- నా హీరోయిన్లు(ఆనాటి హృదయాల.. )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోభన్‌బాబు ఆకస్మిక మరణం.
ఛానల్స్‌లో శోభన్‌బాబు -ఈ జీవిత చదరంగంలో.. కథనాలు ప్రసారమవుతున్నాయి. శోభన్‌బాబుతో ఏమాత్రం సంబంధం లేని వాళ్లందరూ ఛానల్స్‌లో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. నిజానికి తొలిరోజుల్లో ఏచూరి, ఆ తర్వాత శోభన్‌బాబు హిందీ మాస్టారూ, నేనూ.. ఇంచుమించు శోభన్‌బాబు ‘అడవిదొర’ తరువాత చిత్రసీమ నుంచి విరమించుకున్నంత వరకూ ఉన్నాం. నన్నూ కొన్ని ఛానల్స్ అడిగాయిగాని ఆ సమయంలో మాట్లాడలేని స్థితి. ఏమని మాట్లాడగలను? అది భాషకందని భావం! గొంతు మూగపోయే నిజం. అందుకే టీవీకి అతుక్కుపోయి వౌనంగా వుండిపోయాను.
‘తేజ’ అనే వారపత్రికలో ఆ బాధలో ఏం రాశానో తెలీదు. శోభన్‌బాబు అభిమానులందర్నీ ఏకం చేసిందా రచన.
శోభన్‌బాబుకి లిఫ్ట్ ఇచ్చింది అక్షరాలా అక్కినేని నాగేశ్వరరావు. రాజమండ్రి అప్సర హోటల్లో ‘తహసిల్దారుగారి అమ్మాయి’ చిత్రం వంద రోజుల ఫంక్షను జరిగింది. మొట్టమొదటిసారిగా జమునతో హీరోగా నటించి.. చాలా సక్సెస్ అయ్యాడు. సినిమా సునాయాసంగా వంద రోజులాడింది. ఆ సందర్భంగా శోభన్‌బాబే ఆనందం పట్టలేక తబ్బిబ్బయిపోయాడు. అంత గొప్ప విజయం అది.
అక్కినేని మాట్లాడిన మాటలు నేనూ మరిచిపోలేను. ‘తహసిల్దారుగారి అమ్మాయి’ చిత్రం చూశాను. నేనే నటించినట్లుంది. శోభన్‌బాబు ద్విపాత్రాభినయం చక్కగా చేశాడు. ముఖ్యంగా తండ్రిపాత్రలో చాలా సన్నివేశాల్లో నన్ను తలపింపచేశాడు. నాకు ధైర్యంగా వుంది. నాకు వారసుడు శోభన్‌బాబే... ‘హి ఈజ్ ద హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ’ అన్నాడు. అంతా చప్పట్ల వాన... పుణ్య గోదావరి పరవశించిపోయింది.
దీంతో అక్కినేనితో రెగ్యులర్‌గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్లు శోభన్‌బాబు కేసి మళ్లారు. కొంతమంది అక్కినేనిని మరిచిపోయి శోభన్‌బాబునే కంటిన్యూ చేశారు. అక్కినేని అలవాట్లను పుణికిపుచ్చుకున్న శోభన్‌బాబు ప్రొడ్యూసర్లతో కలిసిపోయి, వాళ్ల కష్టసుఖాల్లో పాలుపంచుకొని, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. దీనికి అక్కినేనే బాధ్యుడు!
శోభన్‌బాబు మంచి రైజింగ్ టైమ్‌లో వున్నాడు. అప్పట్లో మిక్కిలినేని జగదీష్‌బాబు స్క్రీన్‌ప్లే అనే సినిమా మాసపత్రికలో శోభన్‌బాబుతో ఒక సీరియల్ కోసం ప్రాధేయపడ్డాడు. సరే ‘నేనూ- నా హీరోయిన్లు. నా హీరోయిన్లతో అనుభవాలు నెలనెలా రాస్తాను, వేసుకోండి’ అన్నాడు. జయసుధ పిఆర్‌ఓ జగదీష్‌బాబు-. వెంటనే అనౌన్స్‌మెంట్ చెయ్యడం జరిగిపోయింది. ఆ అనౌన్స్‌మెంట్‌కి పాఠకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది.
నేనెక్కువ సమయం శోభన్‌బాబుతోనే గడిపేవాడ్ని గనుక, నా ఆర్టికల్స్‌ని విశేషంగా ఇష్టపడతాడు గనుక... నాచేత రాయించాలని శోభన్ ఆలోచన. జగదీష్‌బాబు చేత రాయిస్తే ఆయనకీ మంచి పేరొస్తుంది, పత్రికకూ మంచి పేరొస్తుంది అని జయసుధ ఆలోచన. అయితే శోభన్‌బాబు పెద్దమనిషి. ముందు నాతో రాయిస్తానని చెప్పి జగదీష్‌బాబుతో ఎలా రాయిస్తాడు? ఒకవేళ రాయించినా చేయగలిగిందేం లేదు. అయినా మాటంటే మాటే! ‘నేనూ- నా హీరోయిన్లు’ సీరియల్ తానే స్వహస్తాలతో రాసుకున్నాడు. ఒక్కో మాసం పబ్లిష్ అవుతుంటే కుప్పలుతెప్పలుగా ఉత్తరాలు వస్తూండేవి. ఇండస్ట్రీలోనూ పాఠక లోకంలోనూ ఆ సీరియల్ చదవడం ఒక ఫ్యాషను- మిగతా హీరోయిన్లు నేరుగా శోభన్‌ని కలిసి మాగురించి ఎప్పుడు రాస్తారు? అంటూ వేధించేవారు. సూపర్ సూపర్ సక్సెస్ అయ్యింది. శోభన్‌లో అంత మంచి రచయిత వున్నాడు.
కొసమెరుపేవిటంటే జాతీయ అవార్డు గ్రహీతలూ, స్టేట్ అవార్డు గ్రహీతలూ ఈ సీరియల్ ‘విజయచిత్ర’లో వచ్చిందని ఘంటాపథంగా చెప్పగలిగారు. తెలిస్తే తెలిసినట్టుండాలి, తెలియకపోతే నిశ్శబ్దంగా వుండిపోవాలి. ఇలా చరిత్రని సంకరం చేయడమెందుకూ?

-ఇమంది రామారావు 9010133844