Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాసురమైన భూసురుల వంశమూమాపతి వారమేము యా
వాసము జన్మభూమియును వాసిగడించిన సిద్దిపేట ప్రా
వాసము ధర్మభూమియను భాగమతీ నగరమ్ము దెల్పగన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

వాసర లోన నిన్ను సముపాసన జేసి మదీయ వంశజుల్
ధీసము దారులైరి భవదీయ దయావలేశ సిద్దిచేన్
ఆ సరిమాతృవంశజులు నట్టులె తాత రియించి చిరమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!
ఏ సుమ వాటికా సుమములెం తటి దివ్య పరీమళమ్ములన్
వాసితమై రహించినను వాయువు వీచి గ్రసింపకున్న చోన్
నాసముతాగ్రహించినటు నైష్ఠిక కర్మకు జ్ఞాన సిద్దియున్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

భాసకు నక్షరమ్ములును భావనకున్ ప్రకటైక సిద్ధి, య
భ్యాసముకే మొ శ్రద్దయును నాత్మకు తత్పర మాత్మ తత్వమున్
కాసుకు సద్వ్యయమ్ము కలుగన్ పరమార్థము గోచరించు హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

-ఉమాపతి శర్మ 9246171342