Others

మర్మం అంతా కథలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరము శైశవదశ నుండి వృద్ధినొంది చివరకు క్షీణించు దశలో కూడా మనస్సు మాత్రము కల్పనలు ఆపదు. ప్రతి క్షణమూ కాదుకాదు ప్రతి అరక్షణం కూడా వూరుకోక ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఇంకొంక క్షణంలో శరీరం శిథిలమవుతుంది అని తెలిసినా సరే మనసు మాత్రం మనో వేగంతో హిమాలయాల కన్నా ఉన్నతంగా నైనా, పాతాళం ఉన్న వరకు బిలం లోతు గానైనా ఆలోచనలు సాగిస్తూ ఉంటుంది.
చిన్నపిల్లలు కాసేపు నవ్వుకుంటూ ఉంటారు. మరికాసేపటికే ఏడుస్తారు. ఇది కూడా వారి మనస్సులోని ఆలోచనల ఫలితమే. యక్షుడు ధర్మరాజును వాయువుకన్నా వేగవం తమైనది ఏది అంటే మనస్సే అని చెప్పాడు అంటే ఆయన ఎంతగా పరిశోధించాడో మరి.
ఆ మనుసును భగవంతునిపైన లక్ష్యం చేసి, భగవంతుని నామాన్ని స్మరించమంటే చాలు ఎక్కడ లేని ఆపసోపాలు పడుతుంది మనసు సామాన్యులెవరికైనా. అందుకే సామాన్యులు నిధ్రపోతుంటే అసామాన్యులు, లేదా భగవంతునికి ప్రియమైన వారు మేల్కొని భగవంతుని నామస్మరణలో ఉంటారట.
భగవంతునిపైన మనసు నిలిపితే అద్భుతాలు జరగవచ్చు. కానీ మనసు భగవంతునిపైన అంతగా నిలవదు. ఏదో ఒక ఆలోచనవచ్చి నిలకడను చంచలం చేస్తుంది. అందుకే ధ్యానం చేసేటపుడు ఏదో ఒక నామాన్ని జపించమంటారు. నామ జపం ఫలితాన్ని ఇచ్చేదైనాదానితోపాటు మనసును ఆలోచనలకు దూరంగా కాసేపైనా నిలుప డానికి వీలు అవుతుందన్నమాట..
కానీ, ఇట్లా మనస్సును నిలుపలేనివారు హరికథలను వింటే తెలియకుండా తమ చిత్తాన్నంతా భగవంతునిపైన నిలుపుతారట. అటువంటి కథనొకటి స్మరించుకుందాం.
మానవులకు లేచినప్పటినుంచి పడుకునే దాక నా వస్తువులు, నావారు, నేను అనేదాని చుట్టూ ఆలోచన్లు తిరుగుతుంటాయ. అందులోను రాగద్వేషాలు, మమతాను రాగాలు చాలా పెనవేసుకొని ఉంటారు.
గోపాలునితో తిరిగే గోపబాలురు అంతా హాయగా సుఖంగా సంతోషంగా తిరుగు తున్నారట. వారికి కావల్సినపుడు ఎవరి ఇండ్లలోనైనా వెళ్లి వారు దాచుకున్న పాలు పెరుగు వెన్నలను దోచుకుని తింటున్నారట. దీనికి నాయకుడు యశోదమ్మ ముద్దుల కొడుకు. ఎవరైనా ఉట్టి మీద పెట్టుకుని ఉన్నా పిల్లలంతా నిచ్చెన లాగా నిలబడమని తాను వారిపై ఎక్కి ఉట్టి అందుకని మరీ పాలు పెరుగు కుండలను కిందకు దించి నలుగురికీ పెట్టి తాను తినేవాడట. ఇంకా ఇంటివాళ్లు నిద్రపోతుంటే అత్తాకోడళ్లు ఉన్న ఇల్లు అయతే కోడలి మూతికి పూసి వెళ్లేవాడట. కాదంటే అత్త నోటికీ పూసేవాడట. తెల్లవారి నిద్రలేచి పెరుగు కుండ ఉత్తది ఉండటం చూసి ఇదిగో ఈ పెరుగంతా నీవు తిన్నా వంటే నీవు తిన్నావని వాదులాడుకునేవారట. వారంతా చివరకు ఇది అంతా నందుని నందుడు చేస్తున్నాడని తెలుసుకున్నారు. ఈ విషయమం తా యశోదమ్మకు చెప్పాలని అనుకొన్నారు. వారంతా ఎవరిఇంటిలో ఏమేమి వింతలు జరిగాయో చెప్పుకున్నారు. యశోదమ్మ దగ్గరకు వెళ్లి మళ్లీ ఇదంతా చెప్పారు.
కానీ ఆ తల్లి నా ముద్దుగారే నా చిన్ని కొడుకు ఇదిగో నా దగ్గరే ఉన్నాడు మీరంతా వట్టి అబద్దాలు చెబుతున్నారు వెళ్లండి వెళ్లండి అనేదట. అంతే మళ్లీ వీళ్లంతా వాళ్ల వాళ్ళఇళ్లల్లో జరిగే దంతా చెప్పుకునేవారు.
చూశారా.. ఇలా ఎంతసేపు కృష్ణ నామస్మరణ చేశారు. కృష్ణుని పై నిలవని మనస్సును ఎంతగా ఆయనపైనే నిలిపారో. అదిగో అలానే భగవంతుడు అర్చారూపం లోకి వచ్చి ఏమేమి చేశాడో చెప్పుకుంటే చాలు మనసు తనువు రెండూ ఆ కృష్ణపరమాత్మ పైనే ఉండిపోతాయ. ఆ భగవదనుగ్రహం కూడా లభిస్తుంది.

- ఆర్. సుశీల