Others

మహా వ్యసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ళు నులమక ముందే
వేళ్లు తాకాలి సెల్లు
ఫేస్ కడగకముందే
ఫేస్‌బుక్ చూడాలి
టీకప్పు చేతబట్టి
వాట్సాప్ చేయాలి
టిఫిన్ ముగిసే లోగా
ట్విట్టర్ తిరగెయ్యాలి
ఇంటి గడప దాటకముందే
ఇన్‌స్టాగ్రామ్ చెక్ చెయ్యాలి
రోడ్డు దాటుతుండగా
అప్‌లోడ్, డౌన్‌లోడ్లు
సందు దొరికిన చాలు
సందేశాలూ... లైక్‌లు
సెల్లు.. నిత్యమూ అరచేతిలో శోభిల్లు
అంతర్జాల బంధాల పొదరిల్లు
ఆదమరిస్తే వ్యసనమై వర్ధిల్లు

- డా. డి.వి.జి. శంకరరావు, 9440836931