Others

గంగాస్నానం, స్మరణం పాపవినాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశమి తిథితో సంబంధ పడి మనకు రెండు పెద్ద పండువలు ముఖ్యమైనవి. ఒకటి జ్యేష్ఠ శుద్ధ దశమి కాగా, మరొకటి విజయ దశమి. రెండూ పదిరోజులు పర్యాప్తమయ్యే పాడ్యమి తిథులతో ప్రారంభమై, దశమితో ముగిసే పర్వాలు. జ్యేష్ఠ మాసారంభంలో శుక్ల పక్ష ప్రతిపద నుండి దశమి వరకు గంగోత్సవాల పేరుతో నవరాత్రులు ఆచరించడం, ‘‘దశపాపహర దశమి’’గా దశమిని, అనంతరం ‘‘నిర్జల ఏకాదశి’’ని అనుసరించడం సనాతన సంప్రదాయం.
జ్యేష్ఠ శుక్ల దశమి నాడు ‘‘గంగావతరణం’’ జరిగిందని స్మృతి కౌస్త్భుం చెపుతున్నది. సౌమ్యవారంతో హస్తా నక్షత్రం కలిసి వచ్చినపుడు గంగావతరణం జరిగిందని వాల్మీకి రామాయణం స్పష్టం చేస్తున్నట్లు వ్రతోత్సవచంద్రిక కారుడు పేర్కొన్నాడు. నదులను పూజించే ఆర్యుల ఆచార నేపథ్యంలోనే ‘‘గంగోత్సవం’’ అనే పేరున నవరాత్రి ఉత్సవాలు ‘‘దశహర వ్రతం’’ పేరున నిర్వహించే ఆచారం అనాదిగా అమలులో ఉంది. గంగానది నీరు అతి పవిత్రమైంది. ఎన్నాళ్లు నిలువ ఉన్నా చెడిపోనిది. అందుకే నిర్మల నదీ జలాలను పూజించి, నదీస్నానం ఆచరించి, షోడశోపచార విధివిధాన అర్చనలు, నిత్య కర్మానుష్ఠానాలను, దానధర్మాదులను నది వద్ద నిర్వహించడం సనాతన వారసత్వ ఆచరణగా మారింది. గంగా తీర క్షేత్రాలైన కాశి, హరిద్వారము, నాశిక్, మధుర, ప్రయాగ మున్నగు నదీ తీరాలలో గంగోత్సవం బాగా ఆచరిస్తారు.
అక్కడక్కడ గంగాదేవి ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. గంగోత్సవానికి మరో పేరు ‘‘దశపాపహర దశమి’’, లేదా ‘‘దశహర దశమి’’. పది పాపాలను హరించేది అని అర్థం. ఈనాటి సంకల్పంలో ‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే’’ అని ఆచరిస్తారు. జన్మజన్మాంతరాల నుండి వచ్చిన పది విధ పాపాలు పోగొట్టే స్నానమని భావము. జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు అనుదినం స్ర్తిలు పిండివంటలు చేసి, ప్రతిరోజు పదేసి భక్ష్యాలు దక్షిణయుతంగా గురువులకు సమర్పించి, పదకొండో రోజు నిర్జలైకాదశి నాడు పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఉపవాసం ఉండడం అనాదిగా ఆచరణలో ఉన్న సాంప్రదాయం. మొగలాయి చక్రవర్తుల కాలాన జగన్నాథ పండిత రాయలు అనే ఆంధ్ర ప్రాంత సంస్కృత బ్రాహ్మణ కవి, ఒక మహమ్మదీయ స్ర్తిని వివాహమాడి, సనాతనులచే సంఘ బహిష్కృతుడు కాగా, తన, తన భార్య పాతివ్రత్యాన్ని నిరూపించేందుకు కాశీ వెళ్ళి, పండితులతో వాదించినా ఫలితం లేక, యాభై రెండు మెట్లున్న ఒక రేవులో రెండో మెట్టుపై కూర్చుని, యాభై రెండు స్తోత్ర శ్లోకాలు చెప్పగా, ఒక్కో శ్లోక పఠనానికి గంగానది ఒక్కో మెట్టు పైకి వచ్చి, చివరి శ్లోకంతో పండిత రాయల్ని ముంచేసిందని, తద్వారా పవిత్రతను చాటి చెప్పారని కథానాలున్నాయి. నదులను పూజించే ఆచారం ఆర్యులను బట్టి ఏర్పడినా, ఈ రూపేణ ఒక ఆంధ్ర సంస్కృత కవి ఉత్తర హిందూ దేశంలో పూజితుడు కావడం ప్రత్యేకం. దక్షిణాదిన దశపాప దశమి పర్వం సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి యతి వారి పూజకు ప్రత్యేకించ బడడం విశేషం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494