Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడుకు మీది ప్రేమతోడ కర్తవ్యము మరచితిని
ముదిమియందు మునిగి నేను- మూర్ఖుడనై పోతిని.

నే తండ్రిని రామునకు- నా తండ్రియొ మరి యొక్కరు
కాని మీరొ లోకమ్మన తండ్రులకే తండ్రులు.

మీ బిడ్డను మీ వెంటను- అనుపుటకభ్యంతరమే!
మీ యిష్టం వచ్చినప్పుడు- అంపుడి నా సమ్మతమే!’’

అనగా విని ఆ మహర్షి- అమితానందమ్మందెను
అభయహస్తమును బట్టెను- ఆశీస్సుల నిచ్చెను.

‘‘అన్న వెంట నేనుకూడ- అరిగెదనో తండ్రీ!
నన్నంపుడి దయతోనిక- అన్న దిగులు వీడండ్రీ!’’

అనుచును సౌమిత్రి యంత
నేడెను దశరథుని.

సమ్మతించె మహారాజు- సమ్మతించె వౌని
తల్లుల దీవెనలనంది- వెడలిరి సోదరులు.

తన శాఖల ఇనులిద్దర దాచుకొన్న వటవృక్షం
కదలినటుల వారలతో- కదలెనంత వౌని.

ఆవువెంట దూడవోలె- ధర్మమంటి కర్మవోలె
వౌని వెంట వౌనమ్ముగ- ఆ జంటయు వెడలె.

ఒక భుజమ్మునను ధనువు- ఒక భుజమున తూణీరం
చేతను బాణమ్మొకటి- చేతమ్మున విశ్వాసం.

గాలి వోలె, నీటివోలె- పూల పరిమళాల వోలె
పయనించిరి వారలు- ప్రవహించిరి వారలు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087