Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిదురనైన మేల్కొనుచును సేదదీరె రాముడచట
నిదురకె కావలి యనంగ మేల్కొనె సౌమిత్రి యచట.

‘మినుకు మినుకు’మను తారక కునికి నటుల కునికె వౌని
అది కునుకో మెలకువయో అరయునొక్క విపినమ్మే.

‘తెలతెల్లగ తెలవారెను-దిక్కుల సింగార మొలికె!
దివ్య కార్యములు సేయగ-లేలెమ్మా! నరసింహమ’’!

అనుచు లేపె కౌశికుండు
లేచిరి సోదరులు

సూర్యుని కన్నను ముందరనే లేచెను కౌశికుండు
సూర్యునితోపాటు లేచె సూర్యుండన రాముండు

లేచెనంత సౌమిత్రియు- రామునితోడనె లేచెను
రాముని నీడయె లేచెనొ-యను భ్రాంతిని కలిగించెను.

స్నానాదులను ముగించి- సంధ్యావందన మొనర్చి
బయలుదేరినారు వారు- ముమ్మూర్తుల తీరు.

వచనం: కొంతసేపటికి వారు అంగదేశంలోని కామాశ్రమాన్ని చేరుకున్నారు. అక్కడ ఎవ్వరూ లేరు.
‘‘ఇది నిర్మానుష్యంగా ఉందేమిటి! దీనికి కామాశ్రమమని పేరెలా వచ్చింది?’’అంటూ అడిగారు రామలక్ష్మణులు.
అప్పుడు విశ్వామిత్ర మహర్షి దాని కథనిలా చెప్పసాగారు.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087