Others

హిందూ పరిరక్షకుడు విద్యారణ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాఖోపశాలుగా చీలిపోయి అస్తవ్యస్తంగా వున్న హిందూమతాన్ని ఒక త్రాటిమీదకు తెచ్చి వైదిక ధర్మాన్ని ఆదిశంకరులు పునరుజ్జీవింప జేశారు. శతాబ్దాలపాటు వైదిక ధర్మం అన్ని ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచేటట్లు చేయడానికి వీలుగా నాలుగు దిక్కులా ఆమ్నాయాలను స్థాపించి భారతదేశం ప్రపంచానికి తలమానికంగా ఉండేటట్లు శ్రమించి విజయం సాధించారు. అద్వైత సిద్ధాంతమే లోకకల్యాణానికి దిక్సూచియని నిరూపించారు.
అయితే కాలానుగతంగా దేశంలో అనేక దుష్పరిణామాలు సంభవించాయి. బలీయమైన భారతీయ సామ్రాజ్యం పతనంకావడంతో, తిరిగి హిందూమతం, వైదికధర్మం చిక్కుల్లో పడింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీ ఆదిశంకరుల అంశయా అన్నట్లు భారతీయ యవనికపై దర్శనమిచ్చేరు శ్రీ విద్యారణ్యులు.
తెలుగు నాట ఏకశిలా నగరంలో మాయనాచార్య, దేవి దంపతులు ఈ జాతికి అందించిన వరప్రసాదం శ్రీవిద్యారణ్యులు. విద్యారణ్యుల పూర్వాశ్రమ నామం మాధవుడు. తమ్ముడు శాయనుడు చిన్నతనంలోనే జ్ఞాన సముపార్జనకోసం శృంగేరి చేరి, 10వ పీఠాధిపతియైన శ్రీ విద్యాతీర్థస్వామి వారి అంతేవాసిగా, స్వామివారి మన్ననలను పొంది 1328లో భారతీ తీర్థస్వామి యను దీక్షానామంతో పట్టం పొందారు.
విజయనగర సామ్రాజ్య నిర్మాణం, పరిపాలనా విధానం, రాజనీతి, మత, ధర్మ, సంస్కృతుల వైభవం అన్నిటా విద్యారణ్యుల కు అపారమైన మేధో సంపత్తి ఉండేది.
ఇల్లు విడిచి వెళ్లిన తమ్మునికోసం వెదుక్కుంటూ మాధవుడు శృంగేరి చేరుకున్నాడు. తండ్రి మయనాచార్యులవద్దనే మాధవుడు వేదవేదాంగ పారంగతుడయ్యాడు. తన తమ్మునివలె మాధవుడు శ్రీ విద్యాతీర్థస్వామి వారి ఆశ్రయం పొంది తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి, తన సాధనతో గురువులను మెప్పించి 1331లో శ్రీవిద్యారణ్యతీర్థ దీక్షానామంతో సన్మానం స్వీకరించారు. అనంతరం దేశాటనం చేస్తూ కాశీనగరం చేరుకున్నారు.
ఆ అరణ్య ప్రాంతంలో ఒక చోట కుందేళ్ళు వేట కుక్కలను తరమడం వంటి సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోయిన బుక్కసోదరులు ఆ వింత ఘటనను విద్యారణ్యులకు విన్నవించారు. తన ఆలోచనలకు, ఆకాంక్షలకు ఒక ఆధారం లభించిందని విద్యారణ్యులు భావించారు. హిందూ ధర్మపరిరక్షణకు కంకణం కట్టుకున్న స్వామివారిని ఆ వింత సంఘటన ఉత్తేజపరిచింది. ఆ ప్రదేశం ఎంతో శక్తి కలదన్న ఉత్సాహంతో ఆ సోదరలిరువురినీ హిందూమతంలోనికి పునస్వీకరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. హరిహరరాయలు, బుక్కరాయలు సామ్రాజ్యాధిపతులుగా, వారికి ప్రధాన సలహాదారుగా తానుంటూ అచిరకాలంలోనే దక్షిణాపథంలో ఎదురులేని శక్తిగా నిర్మింపజేసి హిందూ ధర్మ పరిరక్షణ, సంస్కృతీ వైభావన్ని పునరుజ్జీవింపజేశారు. ఈ సందర్భంలో విజయనగర సామ్రాజ్య స్థాపనలో జరిగిన అనూహ్య పరిణామ కథ వ్యాప్తిలో వుంది.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం దృఢమైన సామ్రాజ్య వ్యవస్థను ఏర్పాటుచేయాలనే సంకల్పం, అది మూడు వేల ఏళ్ళు అవిచ్ఛిన్నంగా ఉండాలన్న లక్ష్యం విద్యారణ్యుల మదిలో ఉండేది.
శ్రీ విద్యాతీర్థుల మహాసమాధి అనంతరం 11వ పీఠాధిపతిగా శ్రీ భారతీ తీర్థస్వామివారు పీఠాన్ని అలంకరించి 1333నుండి 1380 వరకు శృంగేరి పీఠాధిపత్యం వహించారు. శ్రీ్భరతీ తీర్థస్వామివారు 1380లో శివైక్యం చెందడంతో శృంగేరిపీఠానికి 12వ పీఠాధిపతిగా 1380 నుండి 1386 వరకు అనన్య సామాన్యంగా పీఠానికి ఆధిపత్యం వహించి హిందూ ధర్మపరిరక్షణకు, వైదిక సంస్కారాభ్యున్నతికి ఆదిశంకరులే తిరిగి విద్యారణ్యుల రూపంలో అవతరించారా అన్న కీర్తిని అందుకున్నారు.
శ్రీవిద్యారణ్యులు అపారమైన పాండిత్యం కలవారు. 1800కుపైగా గ్రంథాలను రచించారు. శృంగేరీపీఠంలో శ్రీ ఆదిశంకరాచార్యులవారు శ్రీచక్రాన్ని నిర్మించి, దానిపై మంచి గంథపు చెక్కతోశారదామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విద్యారణ్యులు ఆ దారు విగ్రహ స్థానంలో సువర్ణ ప్రతిమను రూపొందించి ప్రతిష్ఠించారు. నేటికీ ఆ విగ్రహమే నిత్యపూజలు అందుకుంటున్నది. శ్రీ విద్యారణ్యులు అపర ఆదిశంకరులు కీర్తినంది 1386లో తన సంకల్పానికి ఒక రూపునిచ్చి బ్రహ్మీభూతులయ్యారు.

-ఏ.సీతారామారావు