Others

మహనీయుల త్యాగఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ ఓ నవ భారతావని మహోదయులారా! స్వతంత్ర భారతో
ద్యానవనమ్మునందున విహారము సల్పెడు ధన్యులార! స
న్మానముతో స్మరింపుడలనాటి మహత్తర శౌర్యగాధలన్
ఆ నగధీరులైన చరితార్థ మహాత్ముల త్యాగశీలముల్

నీ ప్రథమ సంగ్రామమ్ము ప్రధిత మంగళపాండె
తాంతియా ఝాన్సీల ధైర్యగరిమ
మాలవ్య, మన గాంధి, మహనీయుడౌ తిలక్
దాదాజి, నౌరోజి ధర్మదీక్ష
బార్డోలి వీరుడు వల్లభభాయ్ పటేల్
నేతాజి, నెహ్రూల నియమనిష్ఠ
జలియన్‌వాలాబాగు లాలాలజపతిరాయ
చంద్రశేఖర ఆజాద్ శౌర్య పటిమ
రాజాజి, కృపలాని, రాజేంద్రబాబులు
చిత్తరంజనదాసు శీల శిక్ష
వీర సావర్కరు ధీరుడంబేత్కరుడు
గోవింద వల్లభ గుణగణమ్ము
ఆ సేతు హిమనగమునఖిల భారతజాతి
ఒక్కటై నిలిచిన యుగచరిత్ర

గీ మరువజాలము మన జాతి మహితకీర్తి
భారతీయత మనదైన భావదీప్తి
శాంత్యహింసల సంస్కృతి సహజరీతి
నిలుపుకొనవయ్య సోదరా నిష్ఠతోడ

మ బహుకష్టంబులకోర్చి ప్రాణము తృణప్రాయమ్ముగా నెంచి, దు
స్సహ కౌటిల్య కుతంత్రపాలనకహింసా రీతిలో నాత్మని
గ్రహ సత్యాగ్రహ సాధనాయుధమునే బ్రహ్మాస్తమ్రున్ జేసి యా
మహనీయుల్ సమరమ్ము జేసిరి మహాత్మాగాంధి నేతృత్వమున్

ఉ భాషలనేకముల్ గలవు భారతదేశమునందు మంజులో
నే్మషములైన సంస్కృతులనేకవిధమ్ములునైన నేమి, ప్ర
త్యూషమునందు తూర్పు దెస దోచు వెలుంగు జిలుంగులట్లుగన్
భాషలు భిన్న భిన్నములు భావమదొక్కటె భారతీయమున్

చం ఎవడెదురైన నీ ధరపయన్ కనువేసినగాని, వారికిన్
భవితను గూల్చగా గావలెను భగ్గనునుగ్రతదించగావలెన్
జవమున నిగ్రహించుచు దిశాతటి కావల పారద్రోలుచున్
దవిలి రగల్పుమింక సగనారుల గుండెల నిప్పుకుంపటుల్

- ఉమాపతి బి.శర్మ 9246171342