AADIVAVRAM - Others

జోహార్ జవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సైనికుడా! వీరసైనికుడా!
అప్రతిహత పోరాటపటిమ కలిగిన మా రక్షకుడా!
మాతృభూమికై అశువులు బాసిన మహోన్నతుడా
ముష్కరమూక దొంగ దెబ్బకు బలై పోయిన త్యాగధనుడా
నీ తల్లిదండ్రులను కలిసి ఎంతకాలమయిందో
నీ భార్యతో ముచ్చటించి ఎన్నాళ్లయిందో
నీ బిడ్డలను తనివితీరా ముద్దాడి ఎనే్నళ్లయిందో
అవునులే! వారితో నీకేమి పని!
త్రికాలాలలో నీ పని దేశ రక్షణేగా
నిప్పులు కురిసే ఎండైనా
తడిసి ముద్దయ్యే జోరు వానైనా
హిమపాతం కురిసే చలైనా
అనుక్షణం అప్రమత్తంగా కాపలా
సరిహద్దు రక్షణకై వెన్నుదన్నులా
ఏమిచ్చి తీర్చుకోము నీ రుణము
వెలకట్టలేదు నిన్ను ఏ ధనము
ఓ సైనికుడా! మా జీవితాలన్నీ నీవు పెట్టిన భిక్ష
అందుకే ముష్కరులకు నీపై అంత కక్ష
సైనికునిగా నీవు ప్రవేశించినపుడే!
ప్రాణార్పణకైనా సిద్ధమని చేశావు కదూ ప్రతిజ్ఞ!
ప్రతిజ్ఞా పాలనకు బద్దుడవైనావా
భరతమాత ఒడిలోనే వొదిగిపోయినావా
మేమెన్ని క్రొవ్వొత్తులు వెలిగించినా
ఎన్ని నినాదాలతో నిరసనలు తెలిపినా
పోయిన నీ ప్రాణాన్ని తీసుకురాగలమా
కానీ
నీ స్ఫూర్తిని గుండెల్లో
నీ త్యాగనిరతిని హృదయంలో
నీ దేశభక్తిని మా అణువణువులో
నింపుకొని చైతన్యం పొందుతాం
మా వంతు కర్తవ్యాలను నిర్వహిస్తాం
నీ ఆత్మశాంతికై భగవంతుని కోరుతాం
మరుజన్మలోను నీవీ పవిత్ర భూమిలోనే జన్మించాలనీ
అశ్రు నయనాలతో
నివాళు లర్పించుకుంటున్నాం.

-మద్ది పుల్లారావు 99512 87113