Others

కనిపించేది ఎన్టీఆర్ వినిపించేది వేరొకరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1973 డిసెంబర్ 14న ‘ఎర్రకోట వీరుడు’ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఎగబడ్డారు. బొమ్మపడింది. సినిమా మొదలైన ఇరవై నిమిషాల తరువాత తెరపై ఎన్టీఆర్ కనబడ్డారు. ఆయన డైలాగ్ చెప్పడం మొదలెట్టగానే -ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చెవులు రిక్కించి మళ్లీ శ్రద్ధగా ఎన్టీఆర్ చెప్పే డైలాగులు విన్నారు. కాసేపటికి అర్థమైపోయింది. అది ఎన్టీఆర్ వాయిస్ కాదని. తెరపై కనిపించేది ఆయనే కాని, ఆయన పాత్రకు ఇంకెవరో గాత్రదానం చేశారు. ఏదో తమిళ సినిమాను ఇలా అనువదించి ఉంటారులే అనుకున్నారు ప్రేక్షకులు. అయితే ఇది తమిళ అనువాదం కాదు. నేరుగా తీసిన తెలుగు చిత్రం. ఎన్టీఆర్ సినీ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదొక్కసారే సంభవించింది.
అసలు- ఈ సినిమా మొదలైంది 1955 ప్రాంతంలో. ప్రముఖ దర్శక నిర్మాత హెచ్‌ఎం రెడ్డి తన మేనల్లుడు హెచ్‌వి బాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘వద్దంటే డబ్బు’ మొదలెట్టారు. ఆ సినిమా జరుగుతుండగా పాతాళభైరవి తరహాలో ఎన్టీఆర్‌తో జానపదం తీయాలనుకుని తెలుగు, తమిళ భాషల్లో ‘గజదొంగ’ మొదలెట్టారు. సావిత్రి, బి సరోజదేవి హీరోయిన్లు. రాజనాల, ఆర్ నాగేశ్వరరావు వినా మిగతా తారలంతా తమిళులే. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు ప్రతాప్. మహారాజు కొడుకేగాని, దళపతి కుట్ర కారణంగా గజదొంగగా పెరగాల్సి వచ్చింది. తర్వాత ప్రజాపక్షం వహించి దుర్మార్గులను తుదముట్టించడమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఎస్‌ఎస్ వర్మ ఛాయాగ్రాహకునిగానూ, మార్తాండ్ ఎడిటర్‌గా, టివిఎస్ శర్మ కళా దర్శకునిగా నియమితులయ్యారు. ఆ రెండు చిత్రాలు చివర దశలో ఉండగా హెచ్‌ఎం రెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. హెచ్‌వి బాబు ఏవో తంటాలుపడి ‘వద్దంటే డబ్బు’ విడుదల చేశారు.
‘గజదొంగ’ మాత్రం అలాగే ఆగిపోయింది. తర్వాత ఈ సినిమాను పలువురు టేకప్ చేశారు. ప్రధాన ప్రతినాయక పాత్రధారి ఆర్ నాగేశ్వరరావు చనిపోవడంతో ఆ పాత్రను తమిళ నటుడు నంబియార్‌తో చేయించారు. దర్శకుడూ కూడా మారారు. పార్థసారథి ఆ చిత్రాన్ని పూర్తిచేశారు. తర్వాత మళ్లీ ఆగిపోయింది. చివరకు ఈ చిత్రం నిర్మాత టి గోపాలకృష్ణ దగ్గరకు చేరింది. అప్పటికే ఈ సినిమా మొదలుపెట్టి పద్దెనిమిదేళ్లు గడిచిపోయింది. అయినా ఎన్టీఆర్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు తుది మెరుగులుదిద్ది విడుదల చేయాలని సంకల్పించారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దశరథరామిరెడ్డి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. తెలుగులో ‘ఎర్రకోట వీరుడు’ తమిళంలో- తిరుడాదే తిరుడన్ అని టైటిల్స్ పెట్టారు.
పనె్ననిమిదేళ్ల క్రితంనాటి సినిమాకి డబ్బింగ్ చెప్పమని ఎన్టీఆర్‌ను అడగడం భావ్యం కాదనుకుని దశరథరామిరెడ్డితో ఆ పాత్ర డబ్బింగ్ చెప్పించేశారు. అలాగే సావిత్రి, బి సరోజదేవి, రాజనాల పాత్రలు కూడా వేరేవారితో గాత్రదానం చేయించారు. ఘంటసాల పెద్దకొడుకైన పదహారేళ్ల విజయకుమార్‌కు సంగీత దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. దేవుడుచేసిన మనుషులు, వాడే వీడు వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విడుదలైన ‘ఎర్రకోటవీరుడు’ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపర్చింది. అట్టర్ ఫ్లాప్. వేరేవారి గొంతుతో ఎన్టీఆర్ నటనను అస్సల జీర్ణించుకోలేకపోయారు.

-కె శ్రీనివాసరావు